ఎదురీదలేకే ఈ నిర్ణయమా!!!  

Is Junior Tired Of Fight With Them??-

జూనియర్ ఎన్టీఆర్ అటు బాలయ్యకు, ఇటు చంద్రబాబు కు ఒకింత దూరంగా ఉంటున్నాడు అన్న సంగత అందరికీ తెలిసిందే.అయితే అడపా దడపా బాబాయి గురించి మాట్లాడుతూ, చంద్రబాబును కలుస్తూ ఆయన పార్టీతోను, ఫ్యామిలీతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య ఎన్టీఆర్ నిమ్మకూరు వేదికగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోవడం, అది ఎవ్వరికీ తెలియకుండా కామ్ గా తీసుకోవడం చర్చకు దారి తీస్తుంది..

Is Junior Tired Of Fight With Them??---

సాధారణంగా సినీ రంగంలోనో, లేక రాజకీయ రంగంలోనో ప్రముఖ స్థానంలో ఉన్న వారు మీడియాకు చెప్పో, లేక పార్టీ అబిమానుల మధ్యో దానిని ఒక కార్యక్రమంగా నిర్వహిస్తుంటారు.అలాంటిది జూనియర్ ఎన్.టి.

ఆర్ ఇలా చేయడం ఒకింత ఆలోచించేది గా అందరూ భావిస్తున్నారు.అయితే మరో పక్క ఇంతకాలం అంటీఅంటనట్లుగా ఉన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధించుకోవడానికి, తన సినీ జీవితానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి, వచ్చే కొత్త సినిమా కు తలనొప్పి లేకుండా ఉండడానికి గాను ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న వాదన బలంగా వినిపిస్తుంది.

కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న జూనియర్ టీడీపీ సపోర్టు, బాబాయి బాలకృష్ణ, మామయ్య చంద్రబాబు అండదండలు లేకుంటే కెరీర్ కు కూడా ఇబ్బందులు వస్తాయని భావించి తానే ఒక మెట్టు దిగినట్లుగా అందరూ భావిస్తున్నారు.మరి దీనిని టీడీపీ ఎలా స్వీకరిస్తుందో చూడాలి.