ఏంటీ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ లో విలన్ పాత్ర చేస్తున్నాడా...?

టాలీవుడ్ లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్నటువంటి దర్శకుల్లో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.అయితే ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 Is Jr Ntr Playing Negative Role In Rrr, Rrr News, Rrr Movie Villain News, Is Jr-TeluguStop.com

ఈ చిత్రంలో కథానాయకులుగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు నటిస్తున్నారు.అయితే ఇటీవలే ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

దీంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి.అంతేకాక ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా 45 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి హీరోలో మరియు టైటిల్ ని అయితే రాజమౌళి తెలిపాడు కానీ విలన్ ఎవరన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.దీంతో ప్రస్తుతం నెటిజనులు ఈ విషయాన్ని బాగానే ట్రోల్ చేస్తున్నారు.

అంతేగాక సినిమా పరంగా చూస్తే గతంలో జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ అనే చిత్రంలో నెగిటివ్ రోల్ కలిగి ఉన్నటువంటి పాత్రలో నటించాడు.ఈ పాత్ర ఆ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.

దీంతో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో ఆకట్టుకుంటాడని మరోసారి నిరూపించాడు.అందువల్ల కొందరు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Jr Ntr Role Rrr, Jr Ntr Rrr, Roudramranam, Rrr Jr Ntr, Rrr Villain, Rrr-M

ఆయన ఈ చిత్రాన్ని సస్పెన్స్ ల తెరకెక్కించడంలో రాజమౌళి మంచి దిట్ట.అంతేగాక సినిమా విడుదల అయ్యే అంతవరకు జనాలు దాదాపుగా ఎవరి పాత్ర ఏంటో అని అంచనా వేయలేరు.ఇన్ని రోజులూ హీరోల పాత్రల గురించి కొంత సందిగ్ధత ఉండగా ఇప్పుడు అది పోయి విలన్ ఎవరనే విషయం పై  మళ్లీ సందిగ్ధత నెలకొంది.మరి ఈ విలన్ సందిగ్దతపై రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube