బాబుకి బుడ్డోడు వార్నింగ్ ఇచ్చాడా ? భరోసా ఇచ్చాడా ?

వయస్సు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అనేది అందరూ చెబుతున్న మాట.వచ్చే ఎన్నికలనాటికైనా టీడీపీ బలంగా పుంజుకోవాలంటే బాబు తప్పుకుని సమర్థులకు పార్టీని అప్పగించాలని సూచించే వారు పెరిగిపోతున్నారు.

 Is Jr Ntr Gives Warning Or Suggarion In Ntr Jayanthi-TeluguStop.com

పోనీ బాబు సుపుత్రుడు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిద్దామా అంటే మొదటికే మోసం వస్తుందన్న సంగతి బాబు కి తెలియంది కాదు.అందుకే ఎవరికీ పార్టీ బాధ్యతలు అప్పగించకుండా తానే ఆ బరువు మోస్తున్నాడు.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఎన్టీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బాబులో ఆందోళన కలిగిస్తున్నాయట.

-Telugu Political News

సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీయార్ ఈ రోజు హైదరాబాద్ లోని అన్న గారి ఘాట్ వద్ద చేసిన కామెంట్స్ టీడీపీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి.ఇకపై అన్న గారి జయంతులు, వర్ధంతులు నేనే దగ్గరుండి చూసుకుంటానని, అన్న గారి ఘాట్ పనులను కూడా నేనే చూస్తానంటూ జూనియర్ చెప్పిన మాటలు టీడీపీకి మరోలా అర్ధమవుతున్నాయట.ఇక నుంచి టీడీపీని నేనే చూసుకుంటాను అని జూనియర్ అంటున్నట్లుగా టీడీపీ నేతలు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు.

-Telugu Political News

బాబు పని అయిపోయిందని ఇక పార్టీని నందమూరి వారసులు తమ చేతుల్లోకి తీసుకోవాలని అభిమానులు కొందరు టీడీపీ సీనియర్ నేతలు గగ్గోలు పెడుతున్నారు.గుడివాడ వైసీపీ ఎమ్యెల్యే కొడాలి నాని అయితే నందమూరి వారసుల్లో ఎవరికైనా దమ్ముంటే పార్టీని చేతుల్లోకి తీసుకోని బ్రతికించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.బాబు తరువాత టీడీపీనీ నడిపించే సత్తా లోకేష్‌కు లేదని అర్ధమయిపోయింది.ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ పార్టీని ఏం నడుపుతారనే విమర్శలు వస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని పార్టీ శ్రేయస్సు దృష్ట్యా బాబు తప్పుకుని జూనియర్ ఎన్టీఆర్ కు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఇప్పుడు పార్టీలో కూడా మెల్లగా మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube