ఆర్ఆర్ఆర్ ఓటిటి రిలీజ్ పై షాకింగ్ డెషిషన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.టాక్ తో పని లేకుండానే బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.ఈ సినిమా కోసం ఎదురు చూసే అభిమానులకు టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఆర్ ఆర్ ఆర్ ఓటిటి డేట్ ఫిక్స్ చేసింది.ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత 100 రోజులకు ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలని రాజమౌళి ముందుగానే కండిషన్ పెట్టాడు.

అయితే ఇప్పుడు ఈ కండిషన్ మార్చబోతున్నారట.కేజిఎఫ్ రిలీజ్ అయ్యి అది కూడా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా వచ్చిన తర్వాత థియేటర్స్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా హవా తగ్గిపోయింది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

దీంతో ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటిటి లోకి తీసుకు రానున్నారట.జూన్ 3న ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ కానున్నట్టు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యంతో పాటు ఆనందానికి కూడా గురి అయ్యారు.

Advertisement

ఈ సినిమా జీ5, నెట్ ఫ్లిక్స్ లలో అందుబాటులో ఉంటుంది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు