జనసేన భవిష్యత్ గందరగోళంలోనే ఉందా ?  

Is Janasena\'s Future In Chaos - Telugu Akula Satyanarayana, Chinthala Partha Sarathi, Is Janasena\\'s Future In Chaos, Janasena Chief Pawan Kalyna, Janasena\\'s, Ravela Kishore Babu

రాజకీయంగా బాగా యాక్టివ్ అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన పవన్ దాని నుంచి తొందరగా దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Is Janasena's Future In Chaos

జనసేన కు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, తాము ఏ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదు అని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నా అందుకు తగ్గ పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నట్టుగా కనిపించడం లేదు.ముఖ్యంగా ఆ పార్టీ లో ఉన్న కీలక నాయకులకు భవిష్యత్తు అంధకారమైనట్టుగా కనిపిస్తుండడంతో తమ దారి తాము చూసుకుంటున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల ముందు జనసేనలో తమ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుందని అనేకమంది నాయకులు పార్టీలో చేరారు.సామాజికంగా, ఆర్థికంగా బలమైన నాయకులు జనసేన లో చేరడం తో ఆ పార్టీలో మంచి ఉత్సాహం కనిపించింది.

జనసేన భవిష్యత్ గందరగోళంలోనే ఉందా -Political-Telugu Tollywood Photo Image

అయితే రాను రాను ఆ ఉత్సాహం నీరుగారిపోతూ వచ్చింది.

 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.పార్టీకి చెందిన కీలక నాయకులు ఒక్కొక్కరు చేజారిపోతూ వస్తున్నారు.దీనిని నివారించేందుకు అనేక కమిటీలు వేసినా పెద్దగా ప్రయోజనం అయితే కలగలేదు.

పైగా ఆ కమిటీల ఏర్పాటు పై అసంతృప్తి కూడా పెరిగిపోయింది.ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైలెంట్ గా ఉండిపోయారు.

ఆయన పార్టీలో ఉంటారా లేక పార్టీని వీడుతారా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది.

ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేన నుంచి బిజెపిలో చేరిపోగా రాజమండ్రి నుంచి పోటీచేసిన ఆకుల సత్యనారాయణ కూడా జనసేనను వీడారు.అలాగే జనసేన పార్టీ ప్రభుత్వ మానిటరింగ్ సెల్ చైర్మన్ గా ఉన్న చింతల పార్థసారథి కూడా తాజాగా పార్టీ గుడ్ బై చెప్పారు.ఇలా చెప్పుకుంటూ వెళితే వరుస వరుసగా నాయకులంతా పార్టీని వదిలి వెళుతుండటంతో పవన్ ఆందోళన లో ఉన్నట్టు కనిపిస్తోంది.

 జనసేన పరిస్థితి ఇప్పుడు అంత ఆశాజనకంగా ఉన్నా పవన్ తీరులో మాత్రం మార్పు అయితే వచ్చినట్టు కనిపించడంలేదు.పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతంగా లేకపోవటం , నాయకత్వ లేమి వెరసి పార్టీ ఎన్నికల్లో దెబ్బతింది.అయినా ఇప్పటికీ పవన్ తన వైకిరి మార్చుకునేందుకు ప్రయత్నం చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు తగ్గ పరిస్థితులు పార్టీలో కనిపించడంలేదు.

క్షేత్ర స్థాయిలో బలోపేతం చేద్దామన్న ఆలోచన కూడా పార్టీకి రాకపోవడంతో చాలా మంది నాయకుల్లో అసంతృప్తి చెలరేగి వలసలకు కారణం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు