తెలంగాణలోనూ జనసేన పోటీకి దిగబోతోందా ...?  

  • జనసేన పార్టీ స్థాపించి చాలా కాలమే అయినా ఏపీలో ఇప్పటి వరకు పెద్దగా రాజకీయంగా స్పీడ్ చూపించలేదు. అయితే ఎన్నికలు సమ్పీస్తున్న తరుణంలో అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో జనసేన ఇప్పుడిప్పుడే రాజకీయంగా వేగం పెంచింది. అయితే మొన్నటి వరకు జనసేన పార్టీ పరిస్థితి చూస్తే… రాజకీయాల్లో ఉండి లేనట్టుగా ఉంటూ…. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తుందా అనే అనుమానం కూడా అందరిలోనూ తలెత్తింది. అయితే పవన్ మాత్రం తాము ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు అధికారం కూడా దక్కించుకుంటాము అంటూ… హడావుడి చేస్తున్నాడు. జనసేన పార్టీ ఏపీకి మాత్రమే పరిమితం అవుతుంది అని చెవులు కోరుకున్న వారికి పవన్ కూడా ఝలక్ ఇచ్చాడు.

  • Is Janasena Participating In AP Elections Telangana-Janasena Party Pawan Kalyan Tealangana Date Telangana Loksabha Telangana Mp

    Is Janasena Participating In AP Elections In Telangana

  • జనసేన ఏపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని క్లారిటీ ఇచ్చాడు. అయితే మొన్న జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అనే ప్రశ్నకు … తాము ముందుస్తు ఎన్నికలు వస్తాయని ఊహించలేదని… ఎన్నికల్లోకి వెళ్లేందుకు మేము ఇంకా ప్రిపేర్ కాలేదు అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో పవన్ ఏం చేయబోతున్నాడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి శవం ఇప్పుడు ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఏపీ ఎన్నికలకు సిద్ధం అవుతూనే తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధం అవుతున్నాడు. దీనిలో భాగంగానే… ఈ ఎన్నికల్లో జనసేన బరిలోకి రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో దూరం గా ఉన్న జనసేన, ఈ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పోటీచేసేందుకు సిద్దమవుతుంది.

  • Is Janasena Participating In AP Elections Telangana-Janasena Party Pawan Kalyan Tealangana Date Telangana Loksabha Telangana Mp
  • లోక్ సభ నియోజకవర్గాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిటీలను ప్రకటించడం తో బరిలోకి దిగడం ఖాయం గా కనిపిస్తుంది. మూడు లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లతో పాటు కమిటీలను కూడా ఇప్పటికే ప్రకటించారు. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం లోక్ సభ స్థానాలకు గురువారం కమిటీలను ప్రకటించిన జనసేన అధినేతత్వరలోనే మరిన్ని లోక్ సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెదక్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ లోక్ సభ నియోజకవర్గాలకు కూడా ఇదే తరహాలో కమిటీలను ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ పవన్ టీఆర్ఎస్ పార్టీ మద్దతు పవన్ ఎన్నికల బరిలోకి వెళ్తాడా …? లేక ఒంటరిగానే వెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.