జనసేన కి ప్రజారాజ్యం పరిస్థితి ఎదురవుతుందా...!  

ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా పుట్టిందే జనసేన పార్టీ..బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడానికి జనసేన ముందు ఉంటుంది..ప్రజలకి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా..డబ్బు లేని రాజకీయాలని నిర్మిస్తా..వ్యక్తులని చూసి ఓటు వేయాగలగాలి తప్ప డబ్బు ని చూసి కాదు అనేలా రాజకీయాలని ముందుకు తీసుకువెళ్తా….అది చేస్తా..ఇది చేస్తా అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ప్రజలముందు పులి సినిమాలో డైలాగులు చెప్పినట్టుగా చెప్పిన జనసేనుడు ఇప్పుడు చేస్తోంది ఏమిటి..? ప్రశ్నించడం కోసమే పార్టీ పెడితే ఇప్పటి వరకూ ఏమి చేశారు..? ఇప్పుడు ఉన్న పార్టీలకి భిన్నంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..?

Is Janasena Following Praja Rajyam In 2019 Elections-

Is Janasena Following Praja Rajyam In 2019 Elections

ఇన్ని ప్రశ్నలకి ముందు పవన్ సమాధానం చెప్పాల్సిందే..ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ తానూ అనుకున్న సిద్దంతాలకి నీళ్ళు వదులుతున్నాడా అనే ప్రశ్నలు సామాన్యుడిలో ఉత్పన్నం అవుతున్నాయి. డబ్బున్న వారికే టిక్కెట్టు ఇస్తారా అని ప్రశ్నించిన జనసేన ఇప్పుడు డబ్బున్న వారికే పట్టం కడుతోంది అంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి..ఆర్ధికంగా అండగా ఉన్న వారికే జనసేనలో కీలక భాద్యతలు ఇస్తున్నారనే వాదన నిజం అవుతోంది అంటూ టాక్ వినిపిస్తోంది..మొత్తంగా అన్న టూర్ లోనే తమ్ముడు వెళ్తున్నాడు అంటూ కామెంట్స్ ఇప్పుడు జనసేన పార్టీని చుట్టూ ముడుతున్నాయి./br>

Is Janasena Following Praja Rajyam In 2019 Elections-

ముఖ్యంగా నాకు కులం లేదని చాలా బహిరంగ సభలలో , రాజకీయ వేదికలపై ప్రకటించిన పవన్..ఎన్నికలు దగ్గర పడే కొలది తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది..తన ఆశయాలపై, తన ఇమేజ్ పై అంత నమ్మకం ఉన్నోడయితే ప్రతిచోటా కొత్తవారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి…కానీ పవన్ అక్కున చేర్చుకునేది వైసీపీ , టీడీపీ అధినేతలు పట్టించుకోకుండా అసంతృప్తి గా ఉన్న వ్యక్తులనే అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది అంటున్నారు పరిశీలకులు..

అయితే ఈ తంతు చూస్తూ ఉంటే గతంలో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో ఇలాంటి వైఖరినే అవలంభించాడు..ప్రజారాజ్యం సమయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జనసేనలో జరగకూడదు అంటూనే చిరంజీవికంటే కూడా తప్పటడుగులు వేస్తూ జనసేన ప్రజారాజ్యం ఒక్కటే అనే సంకేతాలు తెలియకుండానే ఇచ్చేస్తున్నాడు..ఏపీలో రాజకీయ పార్టీలకి ప్రత్యామ్నాయం అనే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీ కి ఎందుకు మద్దతు తెలిపాడు అంటూ కౌంటర్ వేస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది..ఇప్పుడు ఉన్న పరిస్థితినే గనుకా పవన్ కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.