రాజ‌కీయ త్యాగాలు.. జ‌న‌సేన‌ను న‌ట్టేట ముంచాయా..?

త్యాగాలు అవ‌స‌ర‌మే… కానీ, రాజ‌కీయాల్లో త్యాగాలు అవ‌స‌ర‌మా?  ఇప్పుడు ఈ చ‌ర్చ తాజాగా నిర్వ‌హించిన జ‌న‌సేన అంత‌ర్గ‌త స‌మావేశంలో కొంద‌రు మేధావులు తెర‌మీద‌కి తెచ్చిన విష‌యం.ఎందుకంటే.

 Is Janasena Creates His Own Problems, Janasena, Pawan Kalyan, Janasenani, Janasa-TeluguStop.com

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతాయ‌ని భావిస్తున్న ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త్యాగాలు చేసుకుంటూ పోతే.పార్టీకి ఒన‌గూరే ప్ర‌యోజ‌నం, న‌ష్టం అనే అంశంపై ఇటీవల జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్  నాదెండ్ల మ‌నోహ‌ర్ చ‌ర్చ చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు పార్టీ మేధావులు ఈ అంశాన్ని లేవ‌నెత్తుతూ.గ‌తాన్ని త‌వ్వారు.“మ‌నం మ‌న కాళ్ల‌పై నిల‌బ‌డుతున్నాం.మ‌న పార్టీకి ప్ర‌త్యేకంగా ఎవ‌రూ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

మ‌న‌మే ఒక‌టి రెండు పార్టీల‌కు ప్ర‌చార‌క‌ర్తుల‌గా ఉండి.అధికారంలోకి వ‌చ్చేందుకు సాయం చేశాం“ అని ఒక నాయ‌కుడు పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలోనే ఒక‌రిద్ద‌రు మాట్లాడుతూ.“రాజ‌కీయాల్లో త్యాగాలు ఎవ‌రూ చేయ‌రు.ఒక పార్టీ కోసం.ఒక‌నేత కోసం.మ‌రో పార్టీ .మ‌రో నేత‌.ఎక్క‌డా త్యాగం చేసిన ప‌రిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేదు.కానీ, ఎటొచ్చీ.మ‌న పార్టీ ఆవిర్భావం నుంచి కూడా త్యాగ రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తోంది.గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ కోసం త్యాగం చేశాం.

అదేస‌మ‌యంలో బీజేపీకి ప్ర‌చారం చేసిపెట్టాం.ఒరిగింది ఏంటి?  గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మ‌నం ఒంట‌రిగా నిల‌బ‌డాల్సి వ‌చ్చింది.

వ్యూహం ఏదైనా.మ‌న‌కు సాయం చేసేవారు లేన‌ప్పుడు మ‌నం త్యాగాలు చేయ‌డం వ‌ల్ల మ‌న పార్టీ సాధించే ల‌క్ష్యం ఏంటి?“ అని నేత‌లు ఒకింత సీరియ‌స్‌గానే చ‌ర్చ‌లో త‌మ అభిప్రాయం వెల్ల‌డించార‌ని జ‌న‌సేన‌లో చ‌ర్చ సాగుతోంది.ఇక‌, త్వ‌ర‌లోనే తిరుప‌తి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌ని, పొత్తులో భాగంగా బీజేపీ ఈ టికెట్‌ను అడిగితే.మ‌నం ఇచ్చేద్దామా?  లేక ఒంట‌రిగా అయినా పోటీకి వెళ్తామా? అనే విష‌యంపైన నేత‌లు దృష్టిసారించారు.ఇప్ప‌టి వ‌ర‌కు అనేక విష‌యాల్లో ఇత‌ర పార్టీలు జ‌న‌సేన‌ను వినియోగించుకుని ల‌బ్ధి పొందుతున్నాయ‌ని, కానీ.జ‌న‌సేన‌కు ఎలాంటి మ‌ద్ద‌తూ ఇవ్వడం లేద‌ని, పైగా జ‌న‌సేన అణ‌చి వేత‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్నాయ‌ని ఒక‌రిద్ద‌రు పేర్కొన‌ట్టు స‌మాచారం.

మొత్తంగా ఈ స‌మావేశంలో నాయ‌కులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్ర‌కారం.జ‌న‌సేన త్యాగాల‌కు ఇప్ప‌టికైనా ఫుల్ స్టాప్ పెట్టి.

పార్టీ ఎదుగుద‌ల‌పై దృష్టి పెట్టాల‌ని అంటున్నారు.మ‌రి నిజంగానే జ‌న‌సేన త్యాగాల పార్టీనా?  ఇత‌ర పార్టీలు దీని నుంచి ల‌బ్ధి పొందాయా?  నేత‌ల మ‌నోభావం ఇలా ఉంటే.ప‌వ‌న్ ఏం చేస్తారో.ఏం చెబుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube