జగ్గారెడ్డి తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా వివాదాస్పదంగా మారిన నేత ఎవరైనా ఉన్నారంటే జగ్గారెడ్డి మాత్రమే.ఓ వైపు తెలంగాణలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు మథనపడుతుంటే.

 Is Jaggareddy Counting The Smells Of Own House , Congress Party , Jagga Reddy , Trs Party , Telangana , Revanth Reddy , Trs Chief Kcr‌ , Medical College In Sangareddy Constituency-TeluguStop.com

జగ్గారెడ్డి మాత్రం స్వప్రయోజనాల కోసం పార్టీ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు.ఆయన ఇప్పటివరకు పదవులు అనుభవించింది.

ఆస్తులు పోగేసుకుంది.కాంగ్రెస్ పార్టీ గొడుగులోనే.

 Is Jaggareddy Counting The Smells Of Own House , Congress Party , Jagga Reddy , Trs Party , Telangana , Revanth Reddy , TRS Chief KCR‌ , Medical College In Sangareddy Constituency-జగ్గారెడ్డి తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పొగడ్తలు మాత్రం పక్క పార్టీ అధినేత మీద చేస్తూ జగారెడ్డి వివాదాస్పదం అవుతున్నారు.ఇదంతా పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడం వల్లే జగారెడ్డి ఇలా చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది.

రేవంత్‌రెడ్డి పదే పదే విమర్శించడం, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయని మీడియా ముందుకు వచ్చి ఆరోపించడం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భజన చేయడం ఇదే జగ్గారెడ్డి తంతుగా మారిపోయింది.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులను ఆయన బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా తన నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పడం లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బతిమిలాడుకుని పనులు చేయించుకోవాల్సి వస్తోందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

తాను బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేను కావడంతో ప్రజల డిమాండ్‌ను అర్థం చేసుకుని సంగారెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఆవశ్యకతను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించానని.కాలేజీ పనులను వెంటనే పూర్తి చేసి సీఎం చేతుల మీద ప్రారంభించాలని మంత్రి హరీష్‌రావును కోరానని జగ్గారెడ్డి గుర్తుచేశారు.ఈ క్రమంలో మెడికల్ కాలేజీని కేటాయించిన కేసీఆర్‌ను పొగిడితే తప్పేమీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

అయితే జగ్గారెడ్డి తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని స్వయంగా కాంగ్రెస్ నేతలే విమర్శిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.జగ్గారెడ్డికి పొరుగింటి పుల్లకూర ఎంతో రుచిగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube