తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు టీడీపీ పట్టు సాధిస్తే.గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ పుంజుకుంది.
కొన్ని నియోజకర్గాలు మినహా.దాదాపు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది.
కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.అయితే, ఎటొచ్చీ.
కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవడం గమనార్హం.ఇలాంటి వాటిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాజమండ్రి సిటీ నియోజకవర్గం.ఇక్కడ నుంచి వైసీపీని గెలిపించాలనేది జగన్ వ్యూహం.అయితే, ఇప్పటికి రెండు సార్లు ఇక్కడ నుంచి వైసీపీ పోటీ చేసినా.అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు.2014లో ప్రముఖ వ్యాపార వేత్త.బొమ్మన రాజ్‌కుమార్‌కు సిటీ టికెట్ ఇచ్చారు జగన్.ఆయన అప్పటి టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి ఆకుల సత్యనారాయణపై ఓటమిపాలయ్యారు.ఈ క్రమంలో గత ఏడాది మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత రౌతు సూర్యప్రకాశరావును జగన్ ఇక్కడ నుంచి పోటీ చేయించారు.అదేసమయంలో టీడీపీ.
కింజరాపు ఫ్యామిలీ కి చెందిన ఆదిరెడ్డి భవానీకి ఇక్కడ టికెట్ ఇచ్చింది.

భవాని మీద పోటీకి వైసీపీ తరఫున రౌతు సూర్యప్రకాశ్ రావు నిలబడ్డారు.అయితే, ఆయన ఓటమి పాలయ్యారు.గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఏకంగా 30 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచింది.
పోనీ.తర్వాతైనా.
పార్టీని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారా? అంటే.అది కూడా లేదు.
దీంతో జగన్ ఇక్కడ పాగావేయాలన్న లక్ష్యం నెరవేరే పరిస్తితి కనిపించలేదు.దీంతో శిఖాకొల్లు శివ రామ సుబ్రహ్మణ్యంకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.అధికార పార్టీ నేతగా శిఖాకొల్లు కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు.ప్రజలకు పథకాలు అందించే విషయంలో ముందున్నారు.కానీ ఎంత అధికారంలో ఉన్నా సరే.ఆదిరెడ్డి భవానీపై పైచేయి సాధించలేక పోతున్నారనే వ్యాఖ్యాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం. దీంతో జగన్ కాన్సెప్ట్ కరెక్టేనా? నేతలను మార్చినంత మాత్రాన.ప్రజలు పార్టీవైపు మొగ్గు చూపుతారా? అనే చర్చ తెరమీదికి రావడం గమనార్హం.
.