మీడియాకు భ‌య‌ప‌డే జ‌గ‌న్ అలా చేశారా… !  

is jagan fear about media and doing that one, andhra pradesh, chief minister, jagan mohan reddy, media fear, road contracts, - Telugu Andhra Pradesh, Chief Minister, Fear, Jagan Mohan Reddy, Media, Road Contracts, Social Media

స‌హ‌జంగా ఏ ప్ర‌భుత్వ‌మైనా.మీడియాకు భ‌య‌ప‌డేది లేదు.

TeluguStop.com - Is Jagan Fear About Media And Doing That One

మీరు రాయాల్సింది రాసుకోండి.మేం చేయాల్సింది మేం చేస్తాం.

అనే చెబుతుంది.ఇది దేశంలోని ఏ రాష్ట్ర‌మైనా అనే మాటే.

TeluguStop.com - మీడియాకు భ‌య‌ప‌డే జ‌గ‌న్ అలా చేశారా… -Political-Telugu Tollywood Photo Image

అలా అంటూనే.మీడియాలో వ‌చ్చిన వార్త‌లు, క‌థ‌నాల ఆధారంగా కొంత మేర‌కు మార్పులు చేసుకోవడం అనేది ఇటీవ‌ల కాలంలో మ‌నం చూస్తూనే ఉన్నాం.

అంత మాత్రాన ప్ర‌భుత్వాలు మీడియాకు భ‌య‌ప‌డిపోయిన‌ట్టేనా?  మీడియాకు ఒణికిపోయిన‌ట్టేనా? అంటే.ఓ వ‌ర్గం మీడియా ఏపీలో చేస్తున్న ప్ర‌చారాన్ని చూస్తే.

జ‌గ‌న్ సర్కారు త‌మ‌కు , త‌మ రాత‌ల‌కు కూడా వ‌ణికిపోతోంద‌ని అనిపిస్తుంది.

తాజాగా రాష్ట్రంలో చేప‌ట్టిన 300 పైచిలుకు ర‌హ‌దారుల రోడ్ల నిర్మాణానికి సంబంధించి న్యూ డెవ‌ల‌ప్‌బ్యాంకు నిధుల‌తో నిర్మింత త‌ల‌పెట్టిన ర‌హ‌దారుల‌కు జ‌గ‌న్ స‌ర్కారు టెండ‌ర్లు పిలిచింది.

అయితే, దీనికి సంబంధించి కార‌ణాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.కేవ‌లం 25 బిడ్లు మాత్ర‌మే ప‌డ్డాయి.

ఈ ప‌రిణామం సంచ‌ల‌నంగా మారింది.వాస్త‌వానికి ర‌హ‌దారుల నిర్మాణం అంటే.

ఒకింత ఎక్కువ‌గా నే కాంట్రాక్టు సంస్థ‌ల‌కు నిధులు మిగులుతాయి.పైగా అంత‌ర్జాతీయ బిడ్డింగ్‌తో బ్రిక్స్ దేశాలు కూడా పాల్గొంటాయ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో కేవ‌లం 25 సంస్థ‌లే పాల్గొన‌డంతో జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారాన్ని పూర్తిగా ర‌ద్దు చేసి.

మ‌ళ్లీ టెండ‌ర్ల‌కు పిల‌వాల‌ని నిర్ణ‌యించారు.

వాస్త‌వానికి ఇది బిడ్డింగ్ ప్ర‌క్రియ‌లో జ‌రిగే అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మేమీ కాదు.

బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.ఏ ప్ర‌భుత్వ‌మైనా.

బిడ్ల వ్య‌వ‌హారంలో స‌రైన స్పంద‌న రాన‌ప్పుడు వాటిని ర‌ద్దు చేయ‌డం, మ‌ళ్లీ పిల‌వ‌డం మామూలే.అయితే, ఓ వ‌ర్గం మీడియా మాత్రం ఇది త‌మ ఘ‌న‌కార్య‌మేన‌ని, టెండ‌ర్ల‌లో లోపాల‌ను తాము బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌బ‌ట్టే.

జ‌గ‌న్ వ‌ణికిపోయార‌ని ప్ర‌చారం చేస్తూ.పుంఖాను పుంఖాలుగా వార్త‌లు ప్ర‌చురించారు.

దీనిపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్నాయి.అనుకున్న విధంగా కాంట్రాక్ట‌ర్లు పోటీకి రాన‌ప్పుడు ఏ ప్ర‌భుత్వ‌మైనా ఇలానే చేస్తుంద‌ని, దీనిలో భ‌య‌ప‌డిపోవ‌డానికి ర‌ద్దు చేయ‌డానికి వేరే కార‌ణం ఏమీ లేద‌ని చెబుతున్నారు.

ఒక‌వేళ‌.త‌మ వారికే క‌ట్ట‌బెట్టాల‌ని జ‌గ‌న్ అనుకుంటే.

ఇప్పుడు టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌రుగ‌దా ? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

#Road Contracts #Fear #Social Media #Andhra Pradesh #Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Jagan Fear About Media And Doing That One Related Telugu News,Photos/Pics,Images..