ఆడవారిపై ఈ బూతులు అలవాటు చేసింది జబర్దస్త్ కాదా?

రారండోయ్ వేడుక చూద్దాం ప్రీరిలీజ్ ఫంక్షన్లో సీనియర్ నటుడు చలపతి రావు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.“ఆడవాళ్ళు హానికరం కాదు కాని పక్కలోకి పనికొస్తారు” అంటూ చలపతిరావు మాట్లాడిన తీరు అందర్ని షాక్ కి గురి చేసింది.సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల అనుభవం ఉండి, ఎంతోమంది మహిళా నటులు, దర్శకులు, సహనటులతో పనిచేసిన చలపతిరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు.కొంచెం ఆలస్యంగా మొదలైనా సినీప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

 Is Jabardast The Reason Behind Adult Jokes On Women?-TeluguStop.com

ఇటు చలపతిరావుపై, ఆ వ్యాఖ్యలను సూపర్ అన్న యాంకర్ రవిపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా బుక్ అయ్యింది.

ఇదంతా ఇలా ఉంటే ఈ వివాదం వలన “జబర్దస్త్” ప్రోగ్రాం మళ్ళీ చర్చలోకి వచ్చింది.

నిన్న టీవిలో చలపతి రావు కూడా మాట్లాడుతూ, జనాలు డబుల్ మీనింగ్ డైలాగులకి బాగా అలవాటు పడ్డారని, టీవిలో బూతులు మాట్లాడుతున్నా ఎంజాయ్ చేస్తున్నారని, అవన్ని వదిలేసి నామీదే పడుతున్నారని ఆయన అన్నారు.

నిన్న ఓ ప్రముఖ టీవి ఛానెల్ కూడా జబర్దస్త్ మీద ఇండైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓ ప్రోగ్రాంని ప్రసారం చేసింది.

సోషల్ మీడియాలో కూడా జబర్దస్త్ ప్రభావం మీదే చర్చలు జరుగుతున్నాయి.కామెడి పేరుతో ఆడవారిని నీచంగా అవమానిస్తున్నారని, వాటినే జోకులు అనుకోని జనాలు టీవిలకు అతుక్కుపోయి చూస్తున్నారని, మరి వాటికి మాత్రం నవ్వి, ఇప్పుడు ఒక నటుడు ఏదో అంటే మాత్రం నీతులు మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.

జబర్దస్త్ పై విమర్శలు రావడం ఇది మొదటిసారి కాదు, ఈ వివాదం మళ్ళీ చర్చని తీసుకొచ్చింది అంతే.మీరేం అంటారు? నిజంగానే జబర్దస్త్ వలన మనం డబుల్ మీనింగ్ డైలాగులకి అలవాటు పడ్డామా? వాళ్ళు ఒకరిని ఒకరు చులకన చేస్తూ మాట్లాడుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నామా? కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు, యాంకర్ రవి చేసే షోలమీద కూడా మహిళా సంఘాలవారు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు బుక్ చేసారు.ఇంట్లో అంతా కలిసి చూసే టీవిలో ఇలాంటివి అవసరం అంటారా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube