వైసీపీలో ఆ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్‌కు ఈసారి ఎదురీత త‌ప్ప‌దా..?

వైసీపీలో ఆ ముగ్గురు నేతలు మైక్ అందుకున్నారంటే ప్రత్యర్థి పార్టీలకు మాటలతో చెమటలు పట్టిస్తారు.వారి నోటి నుంచి వచ్చే మాటలు.

 Is It Wrong To Confront Those Three Fire Brands In Ycp This Time Details, Ycp, A-TeluguStop.com

తుటాల్లా పేలుతాయి.మైక్ అందుకున్నారంటే ఏకబికిన గంటల తరబడి మాట్లాడే టాలెంట్ వారి సొంతం.

ఇంతకీ ఆ నేతలు ఎవరో కాదు.ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్.

ఈ త్రయం…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరుపున, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ఈగ వాలకుండా తమ వాక్చాతుర్యంతో ఫైర్ బ్రాండ్స్‌గా పేరు తెచ్చుకున్నారు.ఈ ముగ్గురు రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అయితే వీరికి తమ సొంత నియోజకర్గాల్లోనే వ్యతిరేక గాలి వీస్తుందన్న ఊహాగాలు బలంగా వినిపిస్తున్నాయి.

ముందుగా సీనియర్ పొలిటీషియన్ అంబటి రాంబాబు విషయం తీసుకుంటే, ఆయన మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు.

రాంబాబు 1989లో తొలిసారిగా రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.మళ్లీ 2019లో సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెలపై గెలిచి దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అయితే తాజాగా నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే రాంబాబుకు వ్యతిరేకత మొదలైంది.ఇక్కడ వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.ఒకటి రాంబాబు వర్గమైతే.మరోటి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం.

రాంబాబుపై ఇప్పటికే పలుసార్లు వైసీపీ అధిష్టానికి వ్యతిరేక వర్గం ఫిర్యాదు చేసినట్లు… ఈసారి సత్తెనపల్లి నుంచి వైసీపీ తరుపున మరో వ్యక్తిని పోటీలో నిలపాలని కోరినట్లు గుంటూరు జిల్లాలో టాక్ బలంగా వినిపిస్తోంది.ఒకవేళా ఈసారి టికెట్ రాంబాబుకు వచ్చినా గెలవడం డౌటే అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని నియోజకవర్గంలో వినిపిస్తోంది.

Telugu Ambati Rambabu, Ap, Ycp Brands, Ycp Mla Rk Roja, Ycp Mlas, Ycp-Telugu Pol

ఇక నగరి నియోజవర్గంలో ఎమ్మెల్యే రోజా పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది.నియోజకవర్గంలో సొంతపార్టీ నేతల నుంచి రోజాకు వ్యతిరేకత బలంగా ఉంది.వైసీపీలో ఉంటూ టీడీపీకి కోవర్టులా పనిచేస్తున్నారని ఇటీవల రోజా వ్యాఖ్యానించడం సంచలనమైంది.టీడీపీతో చేతులు కలిపిన కొందరూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు.

ఇది ఇలా ఉంటే.వరుసగా 2014, 2019లో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.

ఈసారి గెలవడం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం రోజాకు వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Ambati Rambabu, Ap, Ycp Brands, Ycp Mla Rk Roja, Ycp Mlas, Ycp-Telugu Pol

ఎమ్మెల్యే రోజా నగరిలో ఉండేది తక్కువ.హైదరాబాద్‌లో ఉండేది ఎక్కువ అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట.మరీ, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుతెచ్చుకుంటుందో లేదో చూడాలి మరీ.మరో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2009లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు.మళ్లీ 2019లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.

మీడియాలో ఆకట్టుకున్న ఈయన.సొంత నియోజకవర్గ ప్రజలను మెప్పించడంలో విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది.దీంతో మరోసారి పెడన నుంచి గెలుస్తారో లేదో చూడాలి మరీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube