వేసవికాలం మొదలు అయ్యిపోయింది.ఇక మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి.
మామిడి పండు తినటం వలన మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి.మామిడి పండ్లను అందరు తినవచ్చు.
అయితే మధుమేహం ఉన్నవారు మామిడి పండు తినటానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు.మామిడి పండు తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు.
దాంతో మామిడిపండుకి దూరంగా ఉంటారు.అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండును తినవచ్చా? తింటే ఏమి అవుతుందో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా మీడియం సైజ్ మామిడి పండు నుంచి లభించే కేలరీలు ఒకటిన్నర గోధుమ రొట్టెలో ఉన్న కేలరీలతో సమానం.కాబట్టి మధుమేహం ఉన్నవారు మామిడిపండును తినవచ్చు.అయితే భోజనం చేసిన వెంటనే మాత్రం మధుమేహం ఉన్నవారు మామిడిపండుకు తినకూడదు.ఎందుకంటే భోజనం చేసినప్పుడు మన శరీరంలోకి అవసరమైన కేలరీలు చేరతాయి.
భోజనం అయ్యాక మామిడిపండు తింటే కేలరీలు ఎక్కువై కొవ్వుగా మారే అవకాశం మరియు రక్తంలో చక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నాయి.
![Telugu Diabetics, Mangoes, Mangoes Sugar, Sugar, Telugu Tips-Telugu Health Telugu Diabetics, Mangoes, Mangoes Sugar, Sugar, Telugu Tips-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2021/11/is-it-safe-to-eat-mangoes-for-diabetics-patients-detailss.jpg )
అయితే మధుమేహం ఉన్నవారు మామిడిపండు తినటానికి ఒక సమయం ఉంది.ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మధ్య లేదా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ మధ్య ఉండే సమయంలో తింటే ఎటువంటి సమస్య రాదు.రక్తంలో చక్కర స్థాయిలు కూడా పెరగవు.
మామిడిపండు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.అంటే 100 కి 56 మాత్రమే ఉంటుంది.
కాబట్టి మధుమేహం ఉన్న వారు ఎటువంటి భయాలు లేకుండా మామిడి పండ్లను తినవచ్చు.అయితే వాటిని పైన చెప్పిన సమయాల్లో తింటేనే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.