ప్రాంతీయ పార్టీలకి ఈ సారి జాతీయ రాజకీయాలని సాశించే అవకాశం ఉందా

దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హవా ఎప్పుడు ఉంటుంది.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి, యూపీఏ, ఎన్డీఎ కూటమిలుగా దేశ రాజకీయాలలో ఉన్నాయి.

 Is It Regional Parties Influence National Politics-TeluguStop.com

అయితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ప్రాంతీయ పార్టీలే పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో చాలా సార్లు ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించాయి.

కొన్ని సందర్భాలలో ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది.ఇక ఎన్డీఏ కూటమి ప్రస్తానంలో ప్రాంతీయ పార్టీల అండతో వాజ్ పేయి హయాంలో ఒక్కసారి మాత్రమే అధికారంలోకి వచ్చింది.

ఇక దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల కూటమి కూడా ఓ సారి కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి.అయితే ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం సాగలేదు.

ఇదిలా ఉంటే గత ఎన్నికలలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్న మోడీ ఇమేజ్ కారణంగా ఎన్డీఏలో ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.కాని ఈ సారి బీజేపీకి ఆ అవకాశం ఉండదని, ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ఎ పార్టీ అధికారంలోకి రాలేదని మాట రాజకీయాలలో వినిపిస్తుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలని దగ్గర చేసుకోవడం ద్వారా వారి మాట నిజమనే అంగీకరిస్తున్నాయి.ఇక బీజేపీ మాత్రం సొంతం బలాన్ని నమ్ముకొని ఈ సారి మరింత భారీగా సీట్లు సంపాదించి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube