పాపం అని లిఫ్ట్‌ ఇస్తే పోలీసు వారు ఫైన్‌ వేశారు ఎందుకని అడిగితే అవాక్కయ్యే సమాధానం ఇచ్చారు

అందరు కాదు కాని కొందరు మాత్రం రోడ్డుపై నిల్చుని లిఫ్ట్‌ అడిగే వారికి సాయం చేయాలని, వారు కోరిన వద్ద కాకున్నా మనం వెళ్లే దారిలో అయినా కాస్త దూరాన దించాలని భావిస్తారు.మంచి మనసున్న వాళ్లు సైకిల్‌ పై వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్‌ అడిగితే ఇస్తూ ఉంటారు.

 Is It Really Illegal To Give Lift To A Stranger In India What Law Says-TeluguStop.com

ఇక హైవేలపై టూ వీలర్స్‌ మరియు కార్లల్లో వెళ్లే వారు చాలా తరచుగా లిఫ్ట్‌ ఇస్తూనే ఉంటారు.అయితే అలా లిఫ్ట్‌ ఇవ్వడం నేరం అంటూ పోలీసులు ఫైన్‌ వేస్తున్నారు.

ముఖ్యంగా కార్లలో లిఫ్ట్‌ ఇవ్వడం నేరంగా పోలీసులు పరిగణిస్తున్నారు.తాజాగా ఒక వ్యక్తి లిఫ్ట్‌ ఇచ్చిన కారణంగా ఏకంగా వెయ్యి రూపాయల ఫైన్‌ చెల్లించాల్సి వచ్చింది.

పాపం అని లిఫ్ట్‌ ఇస్తే పోలీసు

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ముబయికి చెందిన నితిన్‌ నాయర్‌ అనే వ్యక్తి ఒక చిన్న సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ అధినేత.అతడు ఆఫీస్‌ పూర్తి చేసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్తున్నాడు.ఆ సమయంలో చిటపట చినుకులు పడుతున్నాయి.మరి కాసేపట్లోనే జోరుగా వర్షం మొదలయ్యే అవకాశం ఉంది.అలాంఇ సమయంలో ముగ్గురు వ్యక్తులు నితిన్‌ నాయర్‌ ను లిఫ్ట్‌ అడిగారు, చూడ్డానికి అమాయకంగా ఉన్నారు.పాపం తడిచి పోతున్నారనే ఉద్దేశ్యంతో నితిన్‌ కారు ఆపి వారిని ఎక్కించుకున్నాడు.

కొద్ది దూరం పోయాక పోలీసులు సాదారణ రైడ్‌ నిర్వహిస్తున్నారు.ఆ సందర్బంగా నితిన్‌ కారును ఆపేశారు.

నితిన్‌ వద్ద అన్ని పేపర్లు ఉన్నాయి.అయినా కూడా ట్రాఫిక్‌ పోలీస్‌ ఎస్సై వెయ్యి రూపాయల ఫైన్‌ వేశాడు.

పాపం అని లిఫ్ట్‌ ఇస్తే పోలీసు

ఫైన్‌ కు అవాక్కయిన నితిన్‌ నాయర్‌ ఎందుకు ఫైన్‌ అంటూ ప్రశ్నించాడు.దాంతో ఆ ఎస్సై నీ కారు ఏమైనా ట్యాక్సీనా.ప్యాసింజర్లను ఎక్కించుకు వెళ్తున్నావు.నీది వ్యక్తిగత కారు.వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ కారు నీది.ఇలాంటి కారులో ట్రాన్స్‌పోర్ట్‌ చేయరాదు.

అంటూ ప్యాసింజర్లను ఎక్కించుకోవడం నేరం అన్నాడు.అయితే వారు ప్యాసింజర్లు ఏం కాదు.

కేవలం వారు లిఫ్ట్‌ అడిగితే ఇచ్చాను అంటూ అంటూ నితిన్‌ సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు.అయినా కూడా ఎస్సై వినిపించుకోలేదు.

పాపం అని లిఫ్ట్‌ ఇస్తే పోలీసు

వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న కారులో అపరిచితులను ఎక్కించుకోవడం నేరం.అందుకే ఈ ఫైన్‌ అంటూ తేల్చి చెప్పాడు.ఫైన్‌ కట్టి కారు తీసుకు వెళ్లమంటూ కారులోని కీని తీసుకోవడం జరిగింది.దాంతో నితిన్‌ ఫైన్‌ కట్టి అక్కడ నుండి వెళ్లి పోయాడు.ఈ విషయాన్ని నితిన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.వర్షంలో పాపం అని లిఫ్ట్‌ ఇస్తే ఇలా ఫైన్‌ వేయడం ఏంటీ అంటూ ముంబయి పోలీసులపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube