జేడీ లక్ష్మీనారాయణ చేరికపై చంద్రబాబు పొలిటికల్ ప్లాన్!  

జేడీ లక్ష్మీనారాయణ టిడిపిలో చేరికపై ఎన్నికల రాజకీయం..

Is It Possible To Jd Lakshmi Narayana Join In Tdp-

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల జోరు రేపటి నుంచి హోరెత్తిపోతుంది. ప్రధాన పార్టీలైన టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీ అధినేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయనే ఊహాగానాలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి...

జేడీ లక్ష్మీనారాయణ చేరికపై చంద్రబాబు పొలిటికల్ ప్లాన్!-Is It Possible To JD Lakshmi Narayana Join In TDP

ఈ నేపథ్యంలో ఎలా అయినా ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక సీట్లు సంపాదించి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో టిడిపి వైసిపి ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే వారి రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఎన్నికల ముందు అధికార ప్రతిపక్ష పార్టీలలో ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో తెలుగు దేశాన్ని వీడి వై.సి.పి.

లో చేరిన నాయకుల సంఖ్య ఎక్కువైంది. ఇదిలా ఉంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా ఏపీలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను టిడిపిలో చేరబోతున్నారని వార్తలు వినిపించాయి.

అయితే అందులో వాస్తవం లేదని ఆయన కూడా స్పష్టం చేశారు. కానీ ఎన్నికలలో జేడీ లక్ష్మీనారాయణ తో కొంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అతన్ని రాజకీయంగా తన వ్యూహాల్లో భాగంగా వాడుకోవడం కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.