కేజ్రీ పై ఎందుకు దాడికి పాల్పడ్డానో తెలియడం లేదు  

Is It Not Known Why I Attacked Kejriwal-

సురేష్ చౌహన్ గుర్తు ఉండే ఉంటారు. ఇటీవల ర్యాలీ లో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ పై ఒక వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడే ఈ సురేష్ చౌహన్ ..

కేజ్రీ పై ఎందుకు దాడికి పాల్పడ్డానో తెలియడం లేదు -Is It Not Known Why I Attacked Kejriwal

అయితే బెయిల్ పై బయటకు వచ్చిన చౌహన్ కేజ్రీ వాల్ పై ఎందుకు దాడి చేసానో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. ఇటీవల ఢిల్లీ లో ని ఒక ర్యాలీ లో పాల్గొన్న కేజ్రీ వాల్ పై సురేష్ ఉన్నట్టుండి దాడి చేసాడు. ఆయన కాన్వాయ్ పై కి వెళ్లి మరీ కేజ్రీ పై దాడికి దిగారు.

దీనితో అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్ ఈ ఘటన పై స్పందిస్తూ అసలు ఎందుకు దాడికి పాల్పడ్డానో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించాడు. తన చర్య పట్ల చౌహాన్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు.

ఆమ్ ఆద్మీ పార్టీకి మానసికంగా దగ్గరైన తాను ఇలా ఎందుకు ప్రవర్తించానో తెలియదన్నాడు. తన చర్య పట్ల సిగ్గుతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇకపై తాను ఏ పార్టీ వెంట వెళ్లేదిలేదన్నాడు.

అయితే సురేష్ చౌహన్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కమ్యూనిటీకి కేజ్రీవాల్ ఏం చేయలేదన్న ఒక బాధ అతనికి ఉండేదని ఆక్రమంలో నే దాడికి పాల్పడినట్లు వారు భావిస్తున్నారు. అన్నా హాజారే ఉద్యమం నుంచి చౌహాన్ కేజ్రీవాల్ ర్యాలీలకు, సమావేశాలకు హాజరయ్యేవాడని, కానీ ఆ తర్వాత మారిపోయాడని చౌహాన్ భార్య మమత తెలిపింది.