ఏపీ బీజేపీ నుంచి జంపింగులు అధికంగా ఉండే అవకాశం ఉందా

Is It Likely That The Migrations Of Leaders From Ap Bjp To Other Parties Will Be High

రాజకీయాల్లో ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు.ఈ నియమం తెలియకే చాలా మంది ఎగిరెగిరిపడుతుంటారు.

 Is It Likely That The Migrations Of Leaders From Ap Bjp To Other Parties Will Be High-TeluguStop.com

దీని గురించి తెలిసిన వారు అణుకువగా ఉంటూ తమ పని తాము చేసుకు పోతుంటారు.బీజేపీ పార్టీనే తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని ఉండేది.

కానీ ఆ పార్టీ 2019 ఎన్నికల్లో పొత్తుకు నో చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో నేతలు ఉన్నారు.పొత్తు పెట్టుకున్న సందర్భంలో అధికారం తమ వద్ద లేకపోయినా కానీ మంత్రి పదవులన్నా దక్కాయి.

 Is It Likely That The Migrations Of Leaders From Ap Bjp To Other Parties Will Be High-ఏపీ బీజేపీ నుంచి జంపింగులు అధికంగా ఉండే అవకాశం ఉందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ 2019 నుంచి మాత్రం పార్టీకి ఆ ముచ్చట కూడా లేకుండా పోయింది.ఇదే విషయం గురించి బీజేపీ నేతలు తీవ్రంగా మదనపడుతున్నారు.

ఈ పర్యాయం కూడా పొత్తులు పెట్టుకుందామని యోచిస్తున్నారు.కానీ ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం పొత్తులంటే వద్దని తెగేసి చెబుతున్నారంట.

అసలు ఏమైందంటే…

2014లో తమకు మంత్రి పదవులను ఆఫర్ చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకుందామని ఏపీ బీజేపీ నేతలు చాలా మంది భావిస్తున్నారు.కానీ ఆ విషయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం అనుకూలంగా లేరనే టాక్ నడుస్తోంది.

చివరి సారి తమను మోసం చేసిన టీడీపీ పార్టీతో జట్టు కట్టేదే లేదని ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

కానీ ఆపార్టీలో ఉన్న చాలా మంది నేతలు టీడీపీ పొత్తును కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.మరి బీజేపీ పార్టీ భవిష్యత్ లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.ఏదేమైనా ఏపీ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఇంట్రెస్ట్ నే కలిగిస్తాయి.

చూసే వారికి చూసేంత అన్న రీతిలో ఇప్పుడు ఏపీ రాజకీయాలు సాగుతూ ఉన్నాయి.ఈ పొత్తుల పంచాయతీ ఎటు వైపు వెళ్లనుందో.

Is It Likely That The Migrations Of Leaders From AP BJP To Other Parties Will Be High Details, AP BJP, Ap Politics, Political Leaders Migrations, Somu Veerraju, Ycp, Tdp, Bjp Tdp Alliance, Chandrababu Naidu, Ap Bjp Leaders - Telugu Ap Bjp, Ap, Chandrababu, Somu Veerraju

#Ap Bjp #Chandrababu #AP Bjp #Somu Veerraju #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube