మెడలు విరిచినప్పుడు శబ్దం రావడం మంచిదేనా..?!  

is it good to make noise when the-neck is brokenmake noise, neck , broken, health benifts, health tips, health care, docters,dactors,different sound - Telugu Broken, Docters, Health Benifts, Health Care, Health Tips, Make Noise, Neck

అబ్బా రాత్రి నిద్రలో మెడ పట్టేసింది ఒకటే నొప్పిగా ఉంది.అసలు అటు ఇటు తిరగలేకపోతున్నాను ఒకసారి నా మెడను ఒక పట్టు పట్టరా అని చాలా మంది ఇతరులతో చెప్పడం మనం గమించే ఉంటాము.

TeluguStop.com - Is It Good To Make Noise When The Neck Is Broken

అలాగే మరి కొంతమందికి మెడలు విరుచుకునే అలవాటు కూడా ఉంటుంది.అలాగే కొంతమందికి బాగా పని చేసినప్పుడు లేదంటే ఎద్దన్నా ఒత్తిడికి గురైనప్పుడు ఎవరన్నా మెడను ఒక పట్టు బడితే అప్పుడు హాయిగా ఉంటుందని మెడలు పట్టించుకుంటూ ఉంటారు.

అయితే అలా వేరొకరితో మెడలు విరిపించుకునే అప్పుడు బాగా తెలిసిన వ్యక్తి అయితే పర్వాలేదు, అదే తెలియని వారు మెడ పడితే అది ఒక్కోసారి వికటించే ప్రమాదం ఉంది.అంతేకాకుండా మెడ నరాలు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంది.

TeluguStop.com - మెడలు విరిచినప్పుడు శబ్దం రావడం మంచిదేనా..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే మెడలు విరుచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Telugu Broken, Docters, Health Benifts, Health Care, Health Tips, Make Noise, Neck-Latest News - Telugu

మీరు మెడ విరిచినప్పుడు టక్ మని ఒక శబ్దం వస్తుంది కదా.  దానిని మీరు ఎప్పుడన్నా గమనించారా.అసలు నిజానికి మెడలు విరిచినప్పుడు ఆ శబ్దం ఎందుకు వస్తుందో తెలుసుకోండి.

  ఎవరయితే కీళ్ల వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వారికీ  మెడ విరిస్తే సహజంగానే ఒక రకమైన పాపింగ్ సౌండ్ లాగా వినిపిస్తుంది.అలా జాయింట్లలో ఉండే ద్రవపదార్థం, గాలి ఒక్కసారిగా బయటకి వచ్చినపుడు క్రాక్ అయినట్లు శబ్దం వినిపిస్తుంది.

అలాగే మనం ఎప్పుడన్నా మన జాయింట్లను గట్టిగా స్ట్రెచ్ చేసినప్పుడు కూడా అంతే.వాటిలో ఉండే ద్రవపదార్థం, గాలి ఒక్కసారిగా బయటకు రావడం వలన క్రాకింగ్ అనే శబ్దం వినిపిస్తుంది.

అలాగే మన శరీరంలోని జాయింట్లు లిగమెంట్లు, టెండన్లు అనబడే పోగుల లాంటి నిర్మాణాలతో నిర్మించబడి ఉంటాయి.ఇవి కండరాలు, ఎముకలకు కనెక్ట్ అయి ఉంటాయి.

అందుకే మెడలు విరిచినప్పుడు సాగుతాయి.మళ్ళీ తిరిగి మన మెడను సాధారణ స్థితికి చేర్చినప్పుడు అలా సాగిన కణాలు తిరిగి మళ్ళీ వాటి యథాస్థానానికి చేరగానే క్రాకింగ్ శబ్దం వినిపిస్తుంది.

పై కారణాలు వలన మెడను విరిచినప్పుడు టక్ అనే సౌండ్ మనకి వినిపిస్తుంది.అయితే ఇలా పదే పదే మెడలు విరవడం మంచిదేనా అంటె కాదని అంటున్నారు నిపుణులు.

ఒక్కోసారి అనుకోకుండా మెడ కండరాల దగ్గర ఉన్న లిగమెంట్లకు లేదా ఎముకలకు ఏదన్నా హాని జరిగే ప్రమాదం కూడా ఉంది.అంతేకాకుండా సడెన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయట.

కాబట్టి మీకు కనుక మెడలు విరవడం అలవాటుగా ఉంటే ఆ పద్దతికి స్వస్తి చెప్పడం మంచిది.

.

#Health Benifts #Neck #Health Tips #Health Care #Make Noise

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు