ఆ రెండు వ‌ర్గాలు క‌లిస్తే జ‌గ‌న్‌కు క‌ష్ట‌మేనా..?

వాస్త‌వానికి తెలంగాణ‌లో కంటే కూడా ఏపీలోనే కులాల రాజ‌కీయాలు చాలా వాడీ వేఢీగా సాగుతుంటాయి.అక్క‌డ కుల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయాల‌ను అస్స‌లు ఊహించ‌లేం.

 Is It Difficult For The World If Those Two Categories Are Combined ., Ycp, Tdp,a-TeluguStop.com

ఎందుకంటే కులాల ప‌ట్టింపు ఏపీలో చాలా ఎక్కువ‌గా ఉంటుంది.అందుకే కొన్ని బ‌ల‌మైన కులాలు స‌పోర్టు చేస్తే గ‌న‌క ఏ పార్టీ అయినా అధికారంలోకి వ‌చ్చేస్తుంది.

ఇప్ప‌టికే ఈ విష‌యం ఎన్నోసార్లు నిరూపిత‌మ‌యింది.ఒక‌సారి టీడీపీని చూస్తేనే ఈ విష‌యం అర్థ‌మ‌యిపోతుంది.

ఆ పార్టీ గ‌తంలో కాపు, క‌మ్మ‌తో పాటు బీసీ వ‌ర్గాల‌కు పెద్ద పీట వేసి అధికారంలోకి వ‌చ్చేసింది.

ఏపీలో బ‌లంగా ఉంటున్న కాపు, క‌మ్మ వ‌ర్గాల స‌పోర్టు గ‌తంలో టీడీపీకే ఉండేది.

కానీ ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఎంట్రీతో సీన్ మారిపోయింది.ఆయ‌న ఆ రెండు వ‌ర్గాల‌తో పాటు బీసీల‌ను కూడా త‌న‌వైపు తిప్పేసుకున్నారు.

ఇప్పుడు ఆయ‌న బ‌లంగా ఉన్నారు.ఇంకా చెప్పాలంటే ఏపీలో అస‌లు జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టాలంటే ఏ పార్టీకి సాధ్యం అయ్యేలా లేదు.

ఆయ‌న ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో బ‌ల‌మైన నేత‌గా ముద్ర వేసేసుకున్నారు.దీంతో అటు టీడీపీతో పాటు జనసేన జ‌గ‌న్ ను గ‌ద్దె దించేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Jagan, Janasena, Pavan Kalaya-Telugu Political News

ఈ నేప‌థ్యంలోనే ఈ రెండు పార్టీల పొత్తు అంశం తెర‌మీద‌కు వ‌చ్చేసింది.ఈ పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ఎలాగైనా పొత్తు పెట్టుకుని కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఒక్క తాటి మీద‌కు తెస్తే ఈజీగా జ‌గ‌న్ ప్ర‌భావాన్ని త‌గ్గించొచ్చ‌ని అంటున్నారు ఈ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు.ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు ఏపీలో చాలా ఎక్కువ‌గా ఉన్నాయి.

కాబ‌ట్టి ఆ ఓట్ల‌ను గంప గుత్త‌గా రాబ‌ట్టుకుంటే గ‌న‌క త‌మ‌కు తిరుగుండ‌ద‌ని భావిస్తున్నారంట ఈ రెండు పార్టీల నేత‌లు.ఇందుకోసం ఇప్ప‌టికే అడుగులు కూడా ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.

చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube