భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మనుగడ ఇక కష్టమేనా?

తెలంగాణలో బీజేపీ సత్తా చాటడం ఇక నుండి కష్టంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే అసలు ఏ మాత్రం ఊహించకుండా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ బీజేపీ దుబ్బాక ఎన్నికలో గెలిచి సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు.

 Is It Difficult For Bjp To Survive In Telangana In Futur Bandi Sanjay, Bjp Party-TeluguStop.com

అయితే బీజేపీ జాతీయ పార్టీ కావడంతో జాతీయంగా బీజేపీకి ఉన్న పరిస్థితుల ఆధారంగా అన్ని రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది.అయితే తెలంగాణలో మతతత్వ పార్టీగా ముద్ర పడుతున్న పరిస్థితులలో కేసీఆర్ మన మధ్య మనకే చిచ్చు పెడుతుందని ప్రజల్లో పెద్ద ప్రచారం చేసే అవకాశం ఉంది.

బీజేపీ రాజకీయ విధానంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితులలో బీజేపీ విమర్శలలో కేసీఆర్ ను తిట్టడమే ప్రధాన ధ్యేయంగా ఉండడంతో ఇక బీజేపీ విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది.అందుకే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ ప్రచారాన్ని అసలు ప్రజలు లెక్కలోకి తీసుకోలేదు.

అందుకే బీజేపీకి నాగార్జున సాగర్ లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఉంది.బీజేపీ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని దెబ్బ తీసే విధంగా ఉండడం, హిందూ మతం,  ముస్లిం మతం అంటూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయడంతో బీజేపీ పట్ల ప్రజల్లో బలమైన సాధారణ వ్యతిరేకత అనేది ఏర్పడింది.

ఇది ఇలాగే కొనసాగితే బీజేపీ తెలంగాణలో ప్రజలు అసలు ఓటు వేయడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు నెలకొంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube