సబ్బుతో స్నానం చేయడం మంచిదా? లిక్విడ్ సోప్‌తో స్నానం చేయడం మంచిదా?

మార్కెట్ వివిధ రకాల సబ్బులు మరియు లిక్విడ్ సోప్‌లు క‌నిపిస్తాయి.అయితే వీటిలో మ‌న శ‌రీరానికి ఏది మంచిద‌నే ప్ర‌శ్న మ‌న‌లో త‌లెత్తుతుంది.

 Is It Better To Take A Bath Or Liquid Soap Health Doctors Research People, Liqui-TeluguStop.com

లిక్విడ్ సోప్‌ మరియు సబ్బు మధ్య వ్యత్యాసం వాటిలో ఉపయోగించే పదార్థాలు, మురికిని శుభ్రపరిచే పద్ధతుల్లో ఉంటుంది.వైద్య నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మీరు బయటకు వెళ్లినప్పుడు మీ చర్మం నుండి వచ్చే సహజ నూనెతో దుమ్ము, ధూళి క‌ణాలు కలిసిపోతాయి.

ఇది మీ చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతుంది.మీరు సబ్బును ఉపయోగించినప్పుడు ఆ సబ్బు.

మ‌న శరీరంపై ఏర్ప‌డిన‌ నూనె పొరను తొలగిస్తుంది.వైద్య నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాడీ వాష్ కూడా అదే విధంగా మీ చర్మంపై నుండే మురికిని తొలగిస్తుంది.

బాడీ వాష్‌లలో చర్మంలోని తేమను పునరుద్ధరించడంలో సహాయపడే పదార్థాలు ఉంటాయి.

ఇవి సబ్బులలో ఉండవు.

బాడీ వాష్ లేదా షవర్ జెల్ చాలా తేలిక‌గా ఉంటుంది.సబ్బు అంటుకునే విధంగా లిక్విడ్ సోప్‌ మీ చర్మానికి అంత‌గా అంటుకోదు.

మీ చర్మం పొడిగా ఉంటే మీరు బాడీ వాష్ లేదా షవర్ జెల్ ఉపయోగించడం మంచిది.బాడీ వాష్‌లో మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతూ.

తేమను నిలుపుకునే పదార్థాలు ఉంటాయి. సోరియాసిస్ లేదా మొటిమలలాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే సబ్బు లేదా షవర్ జెల్ ఉపయోగించడం మంచిది.

షవర్ జెల్ లేదా బాడీ వాష్ కంటే సబ్బు పర్యావరణ అనుకూలమైనది.అవి రీసైకిల్ చేయగల ప్యాకేజింగ్‌లో ప్యాక్ చేయబడతాయి.

తక్కువ ధరలతో కూడిన సబ్బులు కొన్నిసార్లు చర్మానికి హానిక‌రంగా మారే అవ‌కాశాలున్నాయ‌ని చ‌ర్మ‌ వైద్య నిపుణులు చెబ‌తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube