ఈట‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ష‌ర్మిల‌.. కానీ లేట్ అయింది మేడ‌మ్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి.ఆయ‌న‌ను లాగేసుకోవ‌డానికి అన్ని పార్టీలూ తెగ ట్రై చేస్తున్నాయి.

 Is It Become Late To Etela Joining Sharmila Party , Ys Sharmila, Etala Rajender,-TeluguStop.com

ఇప్ప‌టికే బీజేపీ ఈ విష‌యంలో స‌క్సెస్ అయింద‌ని తెలుస్తోంది.బీసీల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ఈట‌ల‌.

అటు ఉద్య‌మ కారుడిగా కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు.

దీంతో ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుంటే త‌మ బ‌లం పెరుగుతుంద‌ని అన్ని పార్టీలూ తెగ ట్రై చేశాయి.

కాంగ్రెస్ నేత‌లు బ‌హిరంగంగానే ఆఫ‌ర్లు కూడా ఇచ్చారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల విష‌యంలో పెద్ద‌గా మాట్లాడ‌ని వైఎస్ ష‌ర్మ‌ల ఇప్పుడు ఆయ‌న‌ను తమ పార్టీలోకి ఆహ్వానించారు.

అంతా అయిపోయాక ఇప్పుడు ఆహ్వానించ‌డం ఏంటంటూ అంద‌రూ నోరు వెళ్ల‌బెడుతున్నారు.

ఈరోజు ఆమె త‌మ నాయకులతో లోటస్ పాండ్‌లో సమావేశమైన మాట్లాడారు.

ప్ర‌భుత్వం పెడుతున్న కేసులకు భయపడి ఈటల బీజేపీ వైపు వెళ్తున్నార‌ని, ఇది మంచిది కాద‌న్నారు.తమ పార్టీలోకి రావాలంటూ కోరారు.

Telugu Eetala Rajender, Etela Sharmila, Etela Bjp, Lotus Pond, Rumors, Fan Symbo

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌ను ఎందుకు ఆహ్వానించ‌లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.ఆయ‌న బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయం అయిపోయాక ఇప్పుడు ఆయ‌న ఊసెందుకు ఎత్తుతున్నారంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.ఇక ష‌ర్మిల కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల విష‌యంలో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు.

అలాగే త‌న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద‌నే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపిస్తున్న‌ట్టు వివ‌రించారు.

ఇక త‌మ‌ది టేబుల్ ఫ్యాన్ గుర్తు అంటూ ఫూలిష్ ప్రచారం జరుగుతోందంటూ ఆమె మండిప‌డ్డారు.తాము ఇప్పటి వరకు ఎలాంటి గుర్తుపై చ‌ర్చ చేయ‌లేద‌ని, దేని గురించి ఎంపిక చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ప్రజలకు ఏం అస‌వ‌ర‌మో అది తెలుసుకొని పార్టీ విధులు, బాధ్య‌త‌లు నిర్ణ‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.కరోనా క‌ట్ట‌డి విషయంలో ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఎలాంటి అనుభ‌వం నేర్చుకోలేదని విమ‌ర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube