జై ల‌వ కుశ‌లో " N " స్పెష‌ల్ మీనింగ్ ఉందా..!

దివంగ‌త మాజీ సీఎం నంద‌మూరి రామార‌వు త‌న‌యుడు, నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు.ప్ర‌స్తుతం ఆయ‌న ఇద్ద‌రు కుమారులు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది.

 Is There Any Special Meaning For “n” Letter In Lava Kusha Movie-TeluguStop.com

హ‌రికృష్ణ కుమారులు ఎన్టీఆర్ హీరోగా, క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా బాబి ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ కుశ సినిమా తెర‌కెక్కుతోంది.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ స్పాట్‌ను హ‌రికృష్ణ సంద‌ర్శించి ఎన్టీఆర్‌తో కాసేపు ముచ్చ‌టించారు.ఎన్టీఆర్‌-హ‌రికృష్ణ షూటింగ్ స్పాట్‌లో మాట్లాడుతుండ‌గా ఆ టేబుల్‌పై ఉన్న నేమ్ ప్లేట్‌పై ‘” N ” లవ కుమార్‌’ అనే పేరు కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారనీ, ఓ పాత్ర పేరు ‘జై’, మరో పాత్ర పేరు ‘లవ’, మూడో పాత్ర పేరు ‘కుశ’ అని ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ నేమ్ ప్లేట్‌పై ఉన్న ‘ ” N ” లవకుమార్‌’ పేరు చూస్తోంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ల‌వకుమార్ ముందు ఉన్న ” N ” కు మీనింగ్ ఏంటి నంద‌మూరి అనేనా అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.త‌న ఒరిజిన‌ల్ ఇంటి పేరు నంద‌మూరినే త‌న సినిమాలో క్యారెక్ట‌ర్‌కు కూడా ఇంటిపేరుగా మార్చేశార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇక ఈ సినిమాను ఆగ‌స్టు 12న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube