బీజేపీ నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.తమపై బురద జల్లాలనే ఉద్దేశ్యంతో కీలక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
టెంట్ వేసుకుని నలుగురు కూర్చుంటే ఉద్యమం అవుతుందా అని మంత్రి బొత్స ప్రశ్నించారు.అది చంద్రబాబు అండ్ కో దోపిడీ కోసం జరుపుతున్న ఉద్యమమని తెలిపారు.
ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతారన్నారు.రేపటి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఉండాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.
వికేంద్రీకరణ అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు.