భారత్ పరిస్థితి దారుణంగా ఉందా ? ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారా ?

ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తోంది.నిర్బంధంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు కొన్ని కొన్ని జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తూ జనాలను ఎవరిని ఇళ్లలోంచి బయటకు రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

 Is India's Situation Worse? Declaring Financial Emergency, Article 360, Corona-TeluguStop.com

ప్రపంచ దేశాలు కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది.జనం అంతా అల్లాడుతున్నారు.

ఇదే రకమైన పరిస్థితి మనదేశంలోనూ తలెత్తుతున్నట్లు ఇప్పుడే వార్తలు బయటకు వస్తున్నాయి.దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉన్నట్లే బయట పడుతుంది.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోరాజ్యాంగంలో అరుదుగా ఉపయోగించే ఆర్టికల్ ను తెరమీదకు తీసుకు రావాలని ప్రధాని చూస్తున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ని మోదీ సోమవారం నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితులను విధించేందుకు అవకాశం కల్పిస్తోంది.కాకపోతే అసలు ఈ ఆర్టికల్ ఉపయోగిస్తున్నట్లు ప్రధాని మోడీ కానీ, కేంద్ర బీజేపీ పెద్దలు ఏ ఒక్కరు బయట పెట్టడం లేదు.

ఇదే విషయమై తాజాగా బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి సోషల్ మీడియా ఖాతా ద్వారా వెలుగులోకి తెచ్చారు.కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయడంతో, ఆర్థిక అత్యవసర పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం చర్చించిందని, ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి అని సెన్సెక్స్ క్షీణించి రూపాయి మరింత పడిపోయిందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టేందుకు చర్చిస్తున్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Telugu India, Article, Bjpsubramanya, Corona, Indiasworse, Narendra Modi-Politic

దీంతో దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్ట లో ఉన్నట్లుగా బయటపడింది.అసలు ఆర్టికల్ 360 కింద ఆర్థిక ఎమర్జెన్సీ కేంద్రం విధిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యయాన్ని నియంత్రించేందుకు కేంద్రం అనుమతిస్తుంది.దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది.ఆర్థిక పరిస్థితి రెండు నెలల కాలానికి అమల్లో ఉంటుంది.అవసరమైతే దానిని పొడిగించుకునేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం తెలుపు కుంటే సరిపోతుంది.

ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం వెనకాడడం లేదు.ముందు ముందు ఇంకా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube