ఉప ఎన్నిక ఈట‌ల‌కు, హుజూరాబాద్ కు ఆ విధంగా లాభ‌మా?

ఈట‌ల రాజేంద‌ర్ కు హుజూరాబాద్‌లో ఉన్న ప‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఆయ‌న గ‌త రెండు ద‌శాబ్ధాలుగా నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్నారు.

 Is Huzurabad So Profitable For By Elections-TeluguStop.com

అయితే ఇప్పుడు మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కావ‌డం ఆ వెంట‌నే ఆయ‌న పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ఉప ఎన్నిక ఎపిసోడ్ తరువాయిగా మారింది.అయితే ఈట‌ల రాజీనామా చేయ‌డం ఒకింత హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌తో పాటు ఈట‌ల‌కు కూడా క‌లిసి వ‌చ్చిన‌ట్టు అనిపిస్తోంది.

ఈట‌లను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ చాలానే ఎత్తులు వేస్తున్నారు.ఇక సాధార‌ణంగానే ఉప ఎన్నిక ఏ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చినా అక్క‌డ కేసీఆర్ మార్కు ఉంటుంది.ఆ ప్ర‌జ‌ల‌పై వ‌రాల వ‌ర్షం అనేది కుర‌వడం కామ‌న్‌.అదే విధంగా ఇప్పుడు హుజూరాబాద్‌కు కూడా ప్ర‌త్యేక నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది.

 Is Huzurabad So Profitable For By Elections-ఉప ఎన్నిక ఈట‌ల‌కు, హుజూరాబాద్ కు ఆ విధంగా లాభ‌మా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని పెండింగ్ ప‌నుల‌పై సీఎం దృష్టి పెట్టారు.వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌ణాళిక రూపొందించారు.

ఇక మొన్న జ‌రిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గులాబీ బాస్ ఎన్ని వ‌రాలు కురిపించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Telugu @ktrtrs, Cm Kcr, Cm Kcr Focus Huzurabad Development, Eetala Rajendhar, Etela Constituency, Etela Rajender, Huzurabad By Elections, Pending Works In Huzurabad, Telangana Politics-Telugu Political News

అయితే రేపు జ‌రిగే హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో కూడా వ‌రాలు అనేవి ఉంటాయ‌ని తెలిసిందే.కాగా నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు ఉప ఎన్నిక‌కు ముందే తీరుతాయని తెలుస్తోంది.ఈ కార‌ణంగా హుజూరాబాద్ ప్ర‌జ‌లు సంతోషిస్తున్నార‌ని చెప్పాల్సిందే.

అదే టైమ్‌లో ఈట‌ల‌కు కూడా కొంత బెట‌ర్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ ఆయ‌న‌నే గెలుస్తార‌నే ప్ర‌చారం జ‌ర‌గుతోంది.

అలంటప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు తీరడం ఆయ‌న‌కు మ‌రింత సానుకూల అంశం.కాబ‌ట్టి ఆయ‌న మ‌ళ్లీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పాకులాడాల్సిన ప‌ని ఉండ‌దు.

మొత్తానికి ఉప ఎన్నిక మేలు చేస్తుంద‌నే చెప్పాలి.మ‌రి ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలిచి చ‌రిత్ర సృష్టిస్తారో చూడాలి.

#PendingWorks #HuzurabadBy #Etela Rajender #CmKcr #CM KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు