కళ్యాణ్‌ రామ్‌ తన '118' సినిమా ఫ్లాప్‌ అని ముందే ఫిక్స్‌ అయ్యాడా?  

  • నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌ ఆరంభించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. కాని ఇప్పటి వరకు దశాబ్దంకు ఒక్కటి అన్నట్లుగా రెండు సక్సెస్‌లు మాత్రమే దక్కించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా సక్సెస్‌ కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురు చూస్తున్న కళ్యాణ్‌ రామ్‌ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్‌ దర్శకత్వంలో ‘118’ అనే విభిన్నమైన సినిమాను చేశాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉండటంతో పాటు, ఆకట్టుకునే మేకోవర్‌తో సినిమాలో కనిపించబోతున్నాడు.

  • Is Hero Kalyan Ram Fixed His 118 Movie Plop-118 Release Date Hero About

    Is Hero Kalyan Ram Fixed His 118 Movie Is Plop

  • ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా ముద్దుగుమ్మలు నివేదా థామస్‌ మరియు షాలిని పాండేలు నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. మార్చి 1న ‘118’ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొత్తం చిన్నా చితకా చిత్రాలు చాలానే విడుదల కాబోతున్నాయి. వెంటనే ఏప్రిల్‌లో పెద్ద సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. అందుకే మిగిలి ఉన్న మార్చిని కొన్ని సినిమాలు క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Is Hero Kalyan Ram Fixed His 118 Movie Plop-118 Release Date Hero About
  • టాలీవుడ్‌లో మార్చిలో ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు. ఒక వేళ విడుదలైనా కూడా భారీగా ఓపెనింగ్స్‌ దక్కించుకుని సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 1వ తేదీన 118 చిత్రం ఎలా విడుదల చేయాలని కళ్యాణ్‌ రామ్‌ కమిట్‌ అయ్యాడో అర్థం కావడం లేదు. విడుదల తేదీ విషయంలో ఇంత చెత్త నిర్ణయం తీసుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులకు సినిమా విషయంలో నమ్మకం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాపై నమ్మకం లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానంను సోషల్‌ జనాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాపై ఉన్న అతి నమ్మకం వల్ల కూడా ఇలా డేంజర్‌ నెలలో సినిమాను విడుదల చేస్తున్నారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.