ధనుష్ ఐశ్వర్య విడాకులకు కారణం అతనేనా.. భారీగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విడాకుల గోల ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం విడాకుల వ్యవహారం టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలకి కూడా వ్యాపించిందని చెప్పవచ్చు.మొన్నటికి మొన్న సమంత నాగచైతన్య విడాకులు గురించి ప్రకటన బయట పెట్టగా… తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య జంట కూడా విడాకులు తీసుకున్నామని బహిరంగంగా ప్రకటించారు.

 Is He The Reason For Dhanush Aishwarya Divorce Netizens Are Trolling Heavily Dhanush, Aishwarya, Kollywood, Hero, Divorce, Reason, Film Inudstry-TeluguStop.com

18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడాకుల గురించి చెప్పడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు.ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు వీరి విడాకులపై స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ ధనుష్ ఐశ్వర్య విడాకులకు కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటూ భారీగా అతనిపై ట్రోలింగ్ మొదలు పెట్టారు.

సెలబ్రిటీల విడాకులకు ఈ డైరెక్టర్ కు ఎంతో దగ్గర సంబంధం ఉందని భారీగా అతనిపై ట్రోల్స్ చేస్తున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా తీశారు.ఈ సినిమా పూర్తయ్యేలోగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ సినిమాకు ఓకే చెప్పగానే ఈ జంట విడిపోతున్నారు.

 Is He The Reason For Dhanush Aishwarya Divorce Netizens Are Trolling Heavily Dhanush, Aishwarya, Kollywood, Hero, Divorce, Reason, Film Inudstry-ధనుష్ ఐశ్వర్య విడాకులకు కారణం అతనేనా.. భారీగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదెక్కడి కో-ఇన్సిడెన్స్ అంటూ నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube