ష‌ర్మిల పార్టీకి షాక్ ఇచ్చింది ఆయ‌నేనా.. అందుకేనా ఆమె రాజీనామా?

ఎన్నో ఆశ‌లు, అంచ‌నాల‌తో తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల‌కు వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి.మొద‌టి నుంచి ఆమె పార్టీలో అస‌లు చెప్పుకోద‌గ్గ పెద్ద లీడ‌ర్ లేడ‌నే చెప్పాలి.

 Is He The One Who Shocked Sharmila's Party  Is That Why She Resigne Sharmila, Po-TeluguStop.com

ఆమె త‌ప్ప అస‌లు ప్ర‌జ‌ల‌కు తెలిసిన ముఖ ప‌రిచ‌యం అవ‌స‌రం లేద‌ని నాయ‌కులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమె పార్టీకి పెద్ద తిప్ప‌లు త‌ప్ప‌ట్లేదు.అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీలో కాస్త చురుగ్గా క‌నిపించిన మ‌హిళా నాయ‌కురాలు ఇందిరాశోభ‌న్‌.

ఆమె వ‌ల్ల‌నే తెలంగాణ‌లో అంతో ఇంతో ష‌ర్మిల ప్ర‌ణాళిక‌లు వేస్తోంది.

ప్ర‌తి అడుగులో కూడా ష‌ర్మిల నిర్ణ‌యాల వెన‌క ఇందిరా శోభ‌న్ నిర్ణ‌యాలు ఉన్నాయి.

అంతాల ష‌ర్మిల త‌ర్వాత ఆమె పార్టీని న‌డిపించ‌డంలో ముందున్నారు.అయితే ఇప్పుడు ఆమె రాజీనామా చేయ‌డంతో ష‌ర్మిల‌కు ఉన్న ఒక్క హోప్ కూడా పోయిదంఇ.

మొన్న‌టి వ‌ర‌కు ఆమె వేసిన అడ్‌హ‌క్ క‌మిటీల‌కు చాలామంది రాజీనామాలు చేశారు.దీంతో ష‌ర్మిల అల‌ర్ట్ అయి పార్టీల్లో వ్య‌వ‌హారాల‌ను తాను ద‌గ్గ‌రుండి చూసుకున్నారు.

ఇక ఇందిరా శోభ‌న్ ఆమె వెంటే ఉండ‌టంతో కొంత ఆశ‌లు మిగిలే ఉన్నాయి ఇన్ని రోజుల వ‌ర‌కు.

Telugu Congress, Indira Shoban, Sharmila, Tg-Telugu Political News

కాగా ఇటీవ‌ల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ >కావ‌డంతో ఆయ‌న చ‌క్రం తిప్పేశారు.మొద‌టి నుంచి ఆమె కాంగ్రెస్‌లోనే ఉండ‌టం, పైగా రేవంత్‌రెడ్డికి స‌న్నిహితంగా ఉండ‌టంతో మ‌ళ్లీ ఆ ప‌రిచ‌య‌మే ఆమెను కాంగ్రెస్ వైపు న‌డిపించింద‌ని చ‌ర్చ సాగుతోంది.ఇటీవ‌ల రేవంత్ కూడా ఆమెను క‌లిశాడ‌ని, పార్టీలోకి ఆహ్వానించ‌డా ఆమె కూడా ఒప్పుకుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెల్లేందుకు ఆమె రెడీ అయింద‌ని, అందుకే ష‌ర్మిల పార్టీకి షాక్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.కానీ ష‌ర్మిల‌కు ఇలా వ‌రుస షాక్ లు త‌గ‌ల‌డంతో ఆమె నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టమే అని చెబుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube