దేశానికి కాబోయే ఉపరాష్ట్రపతి ఆయనేనా?

దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల జోరు కనిపిస్తోంది.ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

 Is He The Future Vice President Of The Country, Mukhtar Abbas Naqvi , Bjp , Raj-TeluguStop.com

ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉండగా.విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా అమీతుమీకి దిగారు.

అటు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతోంది.

 Is He The Future Vice President Of The Country, Mukhtar Abbas Naqvi , Bjp , Raj-TeluguStop.com

ఇంకా బీజేపీ అభ్యర్థి ఖరారు కాలేదు.అయితే ఉన్నట్టుండి కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు.

ప్రస్తుతం ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.గురువారంతో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియనుంది.ఆయన్ను బీజేపీ మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు.ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

రాజ్యసభ సభ్యత్వం పొడిగించడకపోవడానికి కారణం ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.దీంతో నక్వీ పేరును రేపో మాపో బీజేపీ ప్రకటిస్తుందని తెలుస్తోంది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్లు వేసేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఉంది.గురువారం వరకు రాజ్యసభ పదవీకాలం ఉన్నందున అప్పటివరకు కేంద్రమంత్రి పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది.

కానీ ఆయన బుధవారమే ఎందుకు రాజీనామా చేశారో అంతుచిక్కని వ్యవహారంలా మారింది.ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాను బుధవారం ఉదయం ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కలిసిన తర్వాతే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Telugu Draupadi Murmu, India, Mukhtarabbas, Primemodi, Rajya Sabha, Yashwant Sin

1957 అక్టోబర్‌ 15న ఉత్తరప్రదేశ్‌‌లో జన్మించిన ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ నోయిడాలోని ‘ఏసియన్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ స్టడీస్‌’లో ఆర్ట్స్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ చదివారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ ఎంపీగానే కాకుండా పెద్దల సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా కూడా ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ గతంలో వ్యవహరించారు.1983 జూన్‌ 8న సీమ నఖ్వీని వివాహం చేసుకున్నారు.2010 నుంచి 2016 వరకు యూపీ తరఫున, 2016 నుంచి జూలై 6, 2022 వరకు జార్ఖండ్‌ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube