తమిళనాడు కాబోయే సీఎం అతనేనా..? తాజా సర్వేలో వెల్లడి..!

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి.రాష్ట్రం వ్యాప్తంగా ఏప్రిల్‏లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమతమ కూటముల ప్రాతిపదికన ప్రచారాన్ని ముమ్మరం చేశారయి.

 Tamil Nadu, Cm, Survey, Viral Latest, News, Elections, Jaya Lalitha, Karuna Nidh-TeluguStop.com

పార్టీ విధానాలకు అనుగుణంగా మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి.మ్యానిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు రాజకీయ పార్టీల నేతల, శ్రేణులు యధాశక్తి ప్రజల్లో సంచరిస్తున్నారు.

ఈ క్రమంలో మీడియా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థల ప్రజాభిప్రాయాన్ని (ఒపీనియన్ పోల్) సేకరించడంలో ఆసక్తి చూపిస్తున్నారు.అయితే దాదాపు ఎక్కువ శాతం సర్వేలు తమిళనాట డీఎంకే అధికార పగ్గాలు పట్టబోతున్నట్లుగా చూపిస్తున్నాయి.

గత పది సంవత్సరాలుగా అన్నా డిఎంకే తమిళనాట అధికారంలో ఉంది.2016లో రెండోసారి అధికార పగ్గాలను చేపట్టిన కొంత కాలానికే జయలలిత మరణించింది.ఈమె 2016 డిసెంబర్ 5న మరణించగా ఆ తర్వాత 2018 ఆగస్టు 7వ తేదీన మరో తమిళ దిగ్గజ నేత, డిఎంకే అధినేత కరుణానిధి కూడా చనిపోయారు.తమిళనాట రాజకీయాలను రెండున్నర దశాబ్దాల పాటు శాసించిన జయలలిత, కురు వృద్ధ నేత కరుణానిధి మరణాలతో తమిళనాడులో కొత్త రాజకీయ శక్తులకు అవకాశం ఏర్పడింది.

ఇక కరుణానిధి తర్వాత డీఎంకే పగ్గాలను చేపట్టారు సీనియర్ నేత స్టాలిన్.దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో పెను మార్పులు జరిగాయి.ఈ క్రమంలోనే ఎన్నో సంస్థలు తమిళనాట అధికార పగ్గం పట్టేది ఎవరా అని సర్వేలు నిర్వహిస్తున్నాయి.ఇందులో భాగంగా మార్చి 24న టైమ్స్ నౌ చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించింది.

ఇందులో తమిళనాడులో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకేదే అధికారమని తేల్చిచెప్పింది.డీఎంకే కూటమి 173 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీ కూటమికి 45 నుంచి 53 స్థానాలు వస్తాయని తమ సర్వేలో తెలిపింది.

ఇక కమల్ హాసన్ పార్టీ ఎంఎన్‌ఎమ్ ఒకటి నుంచి 5 స్థానాలను దక్కించుకునే అవకాశముందని టైమ్స్ నౌ తమ సర్వేలో తెలిపింది.టీటీవీ దినకరన్ పార్టీకి 1-5 స్ధానాలు, ఇతరులు 1-4 స్థానాల్లో గెలిచే అవకాశముందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube