తాప్సి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందోచ్   Is He Tapsee Pannu’s Unrevealed Boyfriend?     2017-11-13   01:27:03  IST  Raghu V

వివాదాస్పద వ్యాఖ్యలతో, ఫోటోషూట్స్ తో, కొన్ని ఇంటర్వ్వ్యూల వలన వార్తల్లో నెగెటివ్ గా నానుతుండే తప్ప, తాప్సి అతడితో తిరుగుతోంది, ఇతడితో ప్రేమాయణం నడుతుపుతోంది అనే వార్తలు మాత్రం మనకు పెద్దగా గుర్తుకు లేవు. అసలు అలాంటి వార్తలు చాలా తక్కువ. అలాంటి తాప్సి మరి నిజంగానే కేవలం వర్క్ మీదే ఉంటూ, పర్సనల్ లైఫ్ ని పక్కన పెడుతోందా అంటే అలాంటిదేమి లేదు. కాని బయటపకుండా జాగ్రత్తపడుతోంది అంతే.

తాప్సీ పెద్దగా క్రికెట్ స్టేడియంలో కనబడదు కాని, బ్యాడ్మింటన్ ని మాత్రం బాగా ఫాలో అవుతుంది. పలుమార్లు తన స్నేహితురాలు మంచు లక్ష్మితో బ్యాడ్మింటన్ ఆటను మైదానంలో తిలకిస్తూ కనబడింది కూడా. తాప్సికి కేవలం ఆ ఆట మీదే కాదు, ఆ ఆట ఆడే ఒక ఆటగాడి మీద కూడా ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది’. అతడే డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయే. నిజానికి ఇతగాడితో తాప్సి సమ్ థింగ్ సమ్ థింగ్ అని కొన్నేళ్ళ క్రితమే వార్తలు వచ్చాయి. అయితే తాప్సి ని వాటిని తోసిపుచ్చింది. కాని ఇప్పటికే తాప్సి అతడిని కలుస్తూనే ఉందట. ఇద్దరు ఈమధ్య కలిసి కనిపించనట్టు ఓ రూమర్. మరి ఇన్నేళ్ళుగా బంధం కొనసాగుతోంది అంటే, పప్పు ఉడుకుతున్నట్టేనా? లేక ఇది కేవలం స్నేహమేనా?

ఇవి వదిలేసి సినిమాలు మాట్లాడుకుంటే, ఈ ఏడాది ఆనందో బ్రహ్మ లాంటి సూపర్ హిట్ ని, బాలివుడ్ లో జుడ్వా 2 లాంటి భారి బ్లాక్బస్టర్ ని సొంతం చేసుకున్న ఈ 30 ఏళ్ల సుందరి ప్రస్తుతం తడ్కా, ముల్క్ అనే రెండు హిందీ సినిమాలు చేస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.