గూగూల్‌పే చెల్లింపులను నమ్మవచ్చా..?!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ పై మక్కువ చూపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ ఏదైనా సరే సెక్యూరిటీ ఉందా లేదన్న విషయాన్ని చూసుకునే పేమెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు.

 Is Google Pay Is Safe To Use Rbi In Delhi High Court , Google Pay, Payments, Rbi-TeluguStop.com

తాజాగా గూగుల్ మొబైల్ పేమెంట్ యాప్ అయిన గూగూల్‌ పే ఎటువంటి ఆర్బీఐ అధికారిక అనుమతి లేకుండానే ఆర్థిక వ్యవహారాలు చేపడుతుందని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు అభిజీత్ ఆరోపణలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

అంతేకాకుండా గూగుల్ పేమెంట్ సిస్టంల వ్యవహరిస్తోందని ఇది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ విరుద్ధమని అభిజీత్ ఆరోపణలు చేశారు.ఇలా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆర్‌బీఐ నుంచి ఇప్పటి వరకు గూగుల్ పై ఎటువంటి అనుమతులు లేవని తన పిల్ లో తెలియజేశారు .ఢిల్లీ హైకోర్టులో ఎన్‌పీసీఐ మార్చి 20, 2019లో విడుదల చేసిన అధికారిక పేమెంట్స్ సిస్ట‌మ్స్ ఆప‌రేట‌ర్ల జాబితాలో గూగూల్ పే పేరు లేదు అన్న విషయాన్ని కోర్ట్ దృష్టికి తీసుకోని వెళ్లారు.

ఇందుకు సంబందించిన కేసు విచారణలో భాగంగా ఆర్బిఐ ఢిల్లీ హైకోర్టు కు తెలియచేస్తూ గూగుల్ పే యూజర్లను సాధారణ ప్రజలకు గందరగోళాన్ని నెలకొల్పింది.

ఇందుకు సంబంధించి గూగుల్ పే  సమాధానం ఇస్తూ. గూగుల్ ప్లే అనేది ఒక యాప్ మాత్రమే అని, అది కేవలం ప్రెమెంట్స్ నిర్వహించేయనందుకు ఒక వాహకంగా మాత్రమే పనిచేస్తుంది తప్ప చెల్లింపు కార్యకలాపాలను నిర్వహించే ఇది కాదని తెలిపింది.

మరోవైపు ఆర్‌బీఐ గూగుల్ ప్లే అనేది థ‌ర్డ్ పార్టీ యాప్ ప్రొవైడ‌ర్ అని ఎటువంటి ఎటువంటి పేమెంట్ సిస్ట‌మ్స్‌ను నిర్వ‌హించ‌డం లేదని తెలియ చేసింది.దీంతో యూజర్స్ కి రిస్క్ తో కూడిన పనిలాగా మారింది.

Telugu Abhijeet, Delhi Highcourt, Google, Google Pay, Googlepay, July, App, Syst

మరోవైపు గూగుల్ పే పూర్తిగా చట్టబద్ధమైనదని, యుపిఐ ద్వారా చెల్లింపులకు గూగుల్ పే తన బ్యాంకు పోస్టులకు కేవలం సాంకేతిక సేవలు మాత్రమే అందజేస్తుందని, దీనికి ఎటువంటి పేమెంట్ సిస్టం ఆపరేటర్ అవసరం లేదు అని తెలియజేసింది.అంతేకాకుండా గూగుల్ పే ద్వారా చేసే ప్రతి చెల్లింపులు కు ఆర్‌బీఐ,  ఐఎఫ్ఎస్ఐ నియమాలను అనుసరిస్తూ జరుగుతాయని ఇవన్నీ పూర్తిగా సురక్షితమైనవి  యూజర్లకు గూగుల్ పే తెలియజేసింది.ఒకవేళ ఎవరైనా యూజర్స్ ప్రెమెంట్స్  విషయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే 24 గంటలు అందుబాటులో ఉండే కస్టమర్ కేర్ కు కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించవచ్చని తెలియజేసింది.

Telugu Abhijeet, Delhi Highcourt, Google, Google Pay, Googlepay, July, App, Syst

మరోవైపు ఆర్బిఐ ఢిల్లీ హైకోర్టులో తెలియజేస్తూ ఇది పూర్తిగా అవాస్తవమని, ఎన్‌పీసీఐ వెబ్సైట్‌లో చెక్ చేసుకోవ‌చ్చు.ఆర్బీఐ కోర్టు హియ‌రింగ్‌లో కానీ, లిఖిత‌పూర్వకంగా ఇచ్చిన స‌మాధానంలో ఎక్క‌డా ఇలా ప్ర‌స్తావించ‌లేదు కాబట్టి పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్ట‌మ్‌ యాక్ట్ 2007ను ఉల్లంఘించ‌డంలేదు’ అంటూ పేర్కొంది.అలాగే గూగుల్ పే ద్వారా చేసే చెల్లింపులు అన్నీ కూడా చాలా సురక్షితమైన అని చట్టబద్ధమైన అని గూగుల్ తన ప్రకటన ద్వారా పేర్కొంది.

ఇది ఇలా ఉండగా మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఈ వ్యవహారం అన్నిటి ప్రెమెంట్స్ పై  ప్రభావితం చేసేది కనుక దీనిపై మరింత విచారణ అవసరమని భావిస్తూ, ఇందుకు సంబంధించిన కేసును 22వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube