ఏంటీ.. ఫన్ బకెట్ భార్గవ్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడా..?

గత కొద్ది కాలంగా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ బాగానే పాపులర్ అయిన “భార్గవ్” పేరు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది.అయితే భార్గవ్ చిట్టాడ యూట్యూబ్ లో ఫన్ బకెట్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

 Is Fun Bucket Bhargav Participating In Telugu Bigg Boss Season 5-TeluguStop.com

కానీ అనుకోకుండా ఓ మైనర్ బాలిక ని బలవంతంగా లొంగ దీసుకొని గర్భవతిని చేసిన ఘటనలో అరెస్ట్ అయ్యాడు.దీంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది.

అయితే ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన ఫన్ బకెట్ భార్గవ్ ఈ విషయం గురించి స్పందిస్తూ తాను ఏ పాపం ఎరుగనని, కేవలం తానంటే గిట్టని కొందరు చేసిన పనుల కారణంగా తాను శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఎమోషనల్ అయ్యాడు.

 Is Fun Bucket Bhargav Participating In Telugu Bigg Boss Season 5-ఏంటీ.. ఫన్ బకెట్ భార్గవ్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఫన్ బకెట్ భార్గవ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఫన్ బకెట్ భార్గవ్ తెలుగులో బాగా పాపులర్ అయిన ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 5వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే షో నిర్వాహకులు మాత్రం ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కాగా ఫన్ బకెట్ భార్గవ్ మైనర్ బాలిక కేసులో అరెస్ట్ కాకముందు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.దీంతో అప్పటి నుంచే ఫన్ బకెట్ భార్గవ్ పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ఉంది.

కానీ చైల్డ్ అబ్యూజ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఫన్ బకెట్ భార్గవ్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారో లేదో అనే విషయం పై కొంతమేర ఆసక్తి నెలకొంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది కరోనా వైరస్ కారణంగా సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ ఏడాది షో నిర్వాహకులు బిగ్ బాస్ హౌస్ ని మరింత కలర్ ఫుల్ గా చేసేందుకు సెలబ్రిటీల వేటలో పడ్డారు.ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, మామిళ్ల శైలజా ప్రియ, యాంకర్ వర్షిణి, హీరోయిన్ ఇషా చావ్లా, సీరియల్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రెడ్డి తదితరుల పేర్లు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.

#BucketBhargav #Child Abuse #Bhargav #TeluguBig #TeluguBig

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు