ఓపెనింగ్స్ తో జాతిరత్నాలు బ్యూటీ అంత సంపాదిస్తోందా..?

చాలా సంవత్సరాల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే.కొత్త హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లకు అందం, అభినయం పుష్కలంగా ఉన్నా సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు రావడం లేదు.

 Is Faria Abdullah Earning Well With Shop Openings, 15 Lakhs , Earning Well , Far-TeluguStop.com

అయితే ఫరియా అబ్దుల్లా మాత్రం మొదటి సినిమా జాతిరత్నాలుతో సక్సెస్ ను అందుకున్నారు.ఆ సినిమాలోని చిట్టి పాత్ర ఫరియా అబ్దుల్లాకు మంచి పేరును తెచ్చిపెట్టింది.

Telugu Lakhs, Well, Faria Abdulla, Shop-Movie

జాతిరత్నాలు సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల ఫరియా అబ్దుల్లాకు మాల్స్ మరియు షాప్ ఓపెనింగ్స్ లకు గెస్ట్ లుగా పిలుస్తున్నారు.జాతిరత్నాలు సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఫరియా అబ్దుల్లా బాగానే క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.జాతిరత్నాలు సినిమాకు ముందు నక్షత్ర అనే షార్ట్ ఫిలిమ్ లో నటించి ఫరియా అబ్దుల్లా గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం షాప్, మాల్స్ ఓపెనింగ్స్ కోసం ఫరియా అబ్దుల్లా 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఫరియా నటించబోయే భవిష్యత్ సినిమాలు హిట్టైతే మాత్రం ఫరియా రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.స్టార్ హీరో రవితేజ నటిస్తున్న ఒక సినిమాలో కూడా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే రవితేజ సినిమాలో ఫరియా అబ్దుల్లా నటిస్తున్నట్టు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.చిన్న సినిమాల్లో కూడా ఫరియాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఫరియా అబ్దుల్లా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది.యంగ్ హీరోయిన్లకు మాత్రం ఫరియా అబ్దులా గట్టి పోటీని ఇస్తున్నారని తెలుస్తోంది.

సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టే సినిమాలకు ఫరియా అబ్దుల్లా ఎంచుకుంటే మాత్రం ఆమె కెరీర్ కు ఢోకా లేదనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube