త్వరలోనే ఫేస్బుక్ పేరు మారబోతుందా..?

సోషల్ మీడియాలో దిగ్గజ కంపెనీగా పేరు పొందిన ఫేస్బుక్ కు గురించి అందరికీ తెలిసిందే.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వినియోగదారుని మొబైల్లో ఫేస్బుక్ ఉండాల్సిందే.

 Is Facebook Going To Change Its Name Soon Facebook,changes , Name, Latest News,-TeluguStop.com

లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఏదో ఒక సమయంలో ఫేస్బుక్ తప్పనిసరిగా చూస్తూ ఉంటారు.ఫేస్బుక్ త్వరలోనే తన పేరును మార్చుకునే ప్రయత్నంలో ఉంది ఫేస్బుక్ కంపెనీకి కొత్త పేరుతో రిఫరెన్స్ చేయాలని ఫేస్బుక్ యాజమాన్యం యోచిస్తున్నట్లు ప్రముఖ పత్రిక కథనంలో వెల్లడించింది.

ఫేస్బుక్ వ్యాపార కార్యకలాపాలపై అమెరికా ప్రభుత్వం నుంచి న్యాయమైన న్యాయపరమైన ఇబ్బందులు పెరుగుతున్నాయి అన్న నేపథ్యంలో కంపెనీ పేరు మార్చు కునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే వివాదాలు ఎదురైనప్పుడల్లా ఫేస్ బుక్ పేరు తరచూ వార్తల్లో రావడం, అది ఫేస్బుక్ యూజర్లు పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని కంపెనీ విశ్వసిస్తోంది.

దీంతో కంపెనీ కి కొత్త పేరు పెట్టి కొంత ఉపశమనం పొందాలని భావిస్తున్నట్లు ఉంది.

అక్టోబర్ 28న జరిగే కంపెనీ వార్షిక సదస్సులో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్పు గురించి మాట్లాడే యోచనలో ఉన్నట్లు, అంతకంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు టెక్ పత్రిక ‘ది వెర్జ్ ‘ పేర్కొంది.

అయితే ఇది కేవలం సోషల్ మీడియా మాత్రమే అనే అభిప్రాయాన్ని కూడా తొలగించుకోవాలని చూస్తున్నట్లు వెజ్ కథనం తెలిపింది.అయితే ఫేస్బుక్ పేరు మార్పు వల్ల యూజర్ల పై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు.

ఫేస్బుక్ కు చెందిన ఇతర యాప్ లో వాట్సాప్ ఇంస్టాగ్రామ్ కూడా ఈ పేరెంట్ కంపెనీ కిందకే తీసుకురానుంది.

Telugu Latest, Zukerberg-Latest News - Telugu

అయితే ఫేస్బుక్ బ్రాండ్ వార్తలపై ఇంకా స్పందించకపోవడం కాకుండా ఏ పేరు పెడతారని దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు.కాగా సిలికాన్ వ్యాలీలో కంపెనీలకు పేరు మార్చడం కొత్తేమి కాదని సంస్థలు తమ సేవలను విస్తరించినప్పుడు బ్రాండ్ పేరును మార్చడం సాధారణమే.2015 లో గూగుల్ కూడా ఆల్ఫాబెట్ కంపెనీ ఏర్పాటు చేసి దాన్నే మాతృసంస్థగా చేసింది.అలాగే ఫేస్బుక్ కూడా మోట వెర్స్ పై దృష్టి పట్టడంతో రీబ్రాండ్ గురించి ఆలోచిస్తున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube