క‌మ‌లాపూర్‌లో హ‌వా సాగిస్తున్న‌ ధ‌ర్మారెడ్డి.. ఈట‌ల గాలికి నిల‌బ‌డుత‌డా..?

ఈట‌ల రాజేంద‌ర్‌కు హుజూరాబాద్‌లో ఉన్న ప‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అక్క‌డ ఆయ‌న‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి అనేవాడే లేడు.

 Is Etela Rajender Withstand Against Dharmareddy In Kamalapur-TeluguStop.com

అప‌జ‌యం అన్న‌ది తెలియ‌కుండా వ‌రుస‌గా ఆయ‌నే గెలుస్తూ వ‌స్తున్నారు.మ‌రి అలాంటి వ్య‌క్తిని ఢీకొట్టాలంటే ఇంకెన్ని ప్లాన్లు వేయాలి.

ఇప్పుడు టీఆర్ ఎస్‌కు ఇదే పెద్ద స‌వాల్‌గా మారింది.ఇందులో భాగంగా ఆయా మండ‌లాల్లో ప‌ట్టున్న నేత‌ల‌ను రంగంలోకి దింపింది.

 Is Etela Rajender Withstand Against Dharmareddy In Kamalapur-క‌మ‌లాపూర్‌లో హ‌వా సాగిస్తున్న‌ ధ‌ర్మారెడ్డి.. ఈట‌ల గాలికి నిల‌బ‌డుత‌డా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే ఈట‌ల‌ను ఓడించేందుకు ఆయ‌న స‌న్నిహితులైన టీఆర్ ఎస్ నేత‌లు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు.

ఇందులో మ‌రీ ముఖ్యంగా ప‌ర‌క‌రాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అంద‌రికంటే ముందున్నాడు.

ఆయ‌న మొద‌టి నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ద‌గ్గ‌రే ఉన్న క‌మ‌లాపూర్ మండ‌లంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాడు.ఈ మండ‌లానికి అన్ అఫీషియ‌ల్ ధ‌ర్మారెడ్డి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ప్ర‌భుత్వ ప‌ర‌మైన అన్ని ప‌నుల‌ను ఆయ‌నే చేస్తున్నారు.ఈ మండ‌లానికి ఏది కావాల‌న్నా ధ‌ర్మారెడ్డి ద‌గ్గ‌రుండి సాంక్ష‌న్ చేయిస్తూ అభివృద్ధి ప‌నులును ప‌రుగుటు పెట్టిస్తున్నాడు.

క‌మ‌లాపూర్ లో ఉన్న టీఆర్ ఎస్ నేత‌లంద‌రినీ టీఆర్ ఎస్ వైపు ఉండే విధంగా పావులు క‌దుపుతున్నారు.

Telugu @ktrtrs, Bjp, Challa Dharma Reddy, Challa Dharmareddy Vs Etela, Eetala Rajender, Huzurabad Constituency, Kamalapur Mandal, Kcr, Telangana Politics, Trs, Trs Leaders-Telugu Political News

మండ‌లంలోని అన్ని ఊర్ల‌ను చుట్టేస్తూ స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.ఒకానొక ద‌శ‌లో ప‌ర‌కాల కంటే ధ‌ర్మారెడ్డి క‌మ‌లాపూర్ మండ‌లంలోనే ఎక్కువ రోజులు ఉంటూ రాజ‌కీయాలు చేస్తున్నారు.ఆయ‌న ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌టానికి కార‌ణం ఏంటంటే క‌మ‌లాపూర్ ఒక‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గం.

ఇక్క‌డి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ రెండుసార్లు గెలిచి జెండా ఎగ‌రేశారు.హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూర్‌ది ప్ర‌ముఖ స్థానం.

ఇక్క‌డ బ‌లం సంపాదిస్తే ఈజీగా గెల‌వ‌వ‌చ్చ‌నే అభిప్రాయం కూడా ఉంది.కానీ ఈట‌ల‌కు ఈ మండ‌లంలో ఉన్న బ‌లం అంతా ఇంతా కాదు.

మొద‌టి నుంచి ఈ మంలంలోని అన్ని ఊర్లు ఈట‌ల ఖాతాలోనే ఉన్నాయి.మ‌రి ఈట‌ల గాలికి చ‌ల్లా ధ‌ర్మారెడ్డి నిల‌బ‌డి గెలిపిస్తాడా లేదా అన్న‌ది చూడాలి.

#ChallaDharma #Telangana #Challa Dharma #Kamalapur #@KTRTRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు