భోజనం చేసాక ఈ పండ్లను తింటే అద్భుతమైన ఎఫెక్ట్స్  

 • సాధారణంగా కొంత మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,రాత్రి డిన్నర్ అయ్యాక గ్యాస్ సమస్య వస్తు ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం లేదా ఆహారం ఎక్కువగా తీసుకోవటం వలన గ్యాస్ సమస్య వస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే ఆహారం తిన్నా తర్వాత కొన్ని రకాల పండ్లను తీసుకుంటే గ్యాస్ సమస్య రాదు. ఇప్పుడు ఆ పండ్ల గురించి తెలుసుకుందాం.

 • -

 • అంజీర్

 • అంజీర్ పండ్లు మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ల‌భిస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్ర ప‌డుతుంది. వ్య‌ర్థాలు బ‌య‌టికి పోతాయి. అంతే కాదు అంజీర్ పండ్ల వ‌ల్ల మ‌న‌కు త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది.

 • అనాస పండు

 • అనాసపండులో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్ణం,గ్యాస్ సమస్యలు ఉన్నవారు భోజనం అయ్యాక తింటే అముఞ్చి ఫలితం కనపడుతుంది. అనాస ముక్కలను తినలేని వారు జ్యుస్ చేసుకొని త్రాగవచ్చు. కానీ ముక్కలుగా తింటేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

 • బొప్పాయి

 • బొప్పాయి పండులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి చాలా బాగా సహాయపడి అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

 • అరటి పండు

 • అరటిపండు భోజనం అయ్యాక తింటే జీర్ణక్రియ బాగా జరిగి గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు రావు. అయితే అరటిపండును చాలా మంది పెరుగు అన్నంలో తింటూ ఉంటారు. ఆలా కాకుండా భోజనం అయ్యాక తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

 • ఆపిల్

 • భోజనం చేసిన పది నిమిషాల తరవాత తింటే తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి ఆపిల్ ఉన్న పోషకాలు సహాయపడతాయి. ఆహారం జీర్ణం బాగా కావటంతో గ్యాస్,అజీర్ణం సమస్యలు రావు.