ఇప్పటికే లీటరకు రూ. 2000 ఉన్న గాడిద పాలు, ఇకపై రూ. 5000 అయ్యేనేమో... వాటిల్లో కూడా వాడుతున్నారట!

ఒకప్పుడు, ఇప్పుడు ఒవరినైనా తిట్టాలి అంటే గాడిద అంటూ తిట్టేస్తాం.కాని పని పాట లేకుండా ఊరికే తిరిగే వారిని గాడిద అని తిట్టడం సబబు కాదు.

 Is Donkeys Milk The Next Big Health Trend-TeluguStop.com

అలా తిడితే గాడిదను అవమానించినట్లు అవుతుంది.గాడిద తన జీవిత కాలంలో కనీసం లక్ష రూపాయలైన సంపాదిస్తుందని నిరూపితం అయ్యింది.

గాడిదలకు ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది.ఒకప్పుడు గాడిదలు అంటే కేవలం బరువులు మోసేదే అని అందరి అభిప్రాయం.

కాని ఇప్పుడు గాడిద వల్ల చాలా ఉపయోగాలున్నాయని శాస్త్రీయంగా నిరూపితం అవ్వడంతో గాడిదలను చిన్న చూపు చూడటం లేదు.ముఖ్య పట్టణాల రోడ్ల మీద గాడిదలను పట్టుకుని గాడిద పాలు అమ్మే వారిని మనం చూడవచ్చు.

గాడిద పాలు ప్రస్తుతం మార్కెట్‌ లో లీటరుకు రెండు వేల రూపాయల వరకు ఉంది.గాడిద పాలల్లో ఉన్న గుణం కారణంగా అంతటి రేటును నిర్ణయించారు.ఎంతటి పెద్ద గాడిద అయినా కూడా రోజులో లీటరు పాలను మాత్రమే ఇస్తుంది.గాడిద పాలు నొప్పులకు, దీర్ఘకాలిక రోగాలకు ఉపశమనం కలిగిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎన్నో అద్బుతమైన ఔషద గుణాలున్న గాడిద పాలు ఇప్పుడు సబ్బుల తయారిలో కూడా వినియోగిస్తున్నారు.ఇండియాలో గాడిద పాలతో తయారు అయిన సబ్బులకు డిమాండ్‌ బాగా పెరిగి పోయింది.

తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో గాడిద పాలతో తయారు చేసిన సబ్బును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.దాంతో ప్రముఖ కంపెనీలు కూడా తమ సబ్బుల్లో గాడిద పాలు కలపాలనే నిర్ణయానిక వచ్చేశాయి.దాంతో గాడిద పాలు మరింత ప్రియం అవ్వడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గాడిద పాలు ఉపయోగం తెలిసిన తర్వాత గాడిదల ఓనర్లు తమ గాడుదలను చాలా ముద్దుగా చూసుకుంటున్నారు.

గాడిదల పాలు చాలా తక్కువగా ఇస్తాయి.వాటినే మూడు నాలుగు చుక్కలు, టీ స్ఫూన్స్‌ చొప్పున అమ్ముతున్నారు.ఇప్పుడు సభ్యుల తయారీలో కావాలి కనుక సదరు కంపెనీలకు లీటర్లకు లీటర్లు తీసుకుంటారు.అలా తీసుకుంటే సామాన్యులకు లభించవు.ఒకవేళ కావాలనుకుంటే భారీగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.గాడిద పాలు అయిదు వేలు కావచ్చు, అంతుకు మించి కూడా కావచ్చు అనేది కొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube