దిల్‌ రాజుకు కరోనా ఉన్నట్లా? లేనట్లా?

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఆరోగ్యం విషయంలో ఇటీవల ఆందోళన వ్యక్తం అయిన విషయం తెల్సిందే.ఆయన వకీల్ సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్బంగా కరోనా బారిన పడ్డాడు అంటూ వార్తలు వచ్చాయి.

 Is Dil Raju Corona Positive Or Not-TeluguStop.com

ఆయన వకీల్‌ సాబ్‌ సినిమా హడావుడి నేపథ్యంలో ఎంతో మందిని ఆయన కలిశాడు.ఇటీవల ఆయన కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా వకీల్‌ సాబ్‌ ప్రమోషన్‌ లో పాల్గొన్నాడు.

కనుక ఆయన నుండి చాలా మందికే కరోనా సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఆ విషయమై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్‌ చేస్తూ వచ్చారు.

 Is Dil Raju Corona Positive Or Not-దిల్‌ రాజుకు కరోనా ఉన్నట్లా లేనట్లా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎట్టకేలకు ఆ విషయం పై ఒక స్పష్టత అనేది వచ్చింది. దిల్‌ రాజుకు కరోనా పాజిటివ్‌ అనేది పూర్తి గా పుకార్లు మాత్రమే.

ఆ విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు అంటూ ఆయన సన్నిహితులు మరోసారి క్లారిటీ ఇవ్వడం తో పాటు దిల్‌ రాజు కొత్త ఫొటోను కూడా రిలీజ్‌ చేశారు.

వకీల్‌ సాబ్‌ సినిమా సక్సెస్‌ నేపథ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులను కూడా దిల్‌ రాజు అభినందించాడు.

ఆ సందర్బంగా దిల్‌ రాజు చాలా యాక్టివ్‌ గా ఉన్నట్లుగా కనిపించింది.కనుక ఖచ్చితంగా దిల్‌ రాజుకు ఎలాంటి కరోనా కాని గిరోనా కాని లేదు అంటూ క్లారిటీ వచ్చింది.

కరోనా లేకుండానే దిల్‌ రాజు గురించి రక రకాలుగా ప్రచారాలు జరిగాయి.అయితే కరోనా భయంతో దిల్‌ రాజు స్వీయ నిర్భందంలోకి వెళ్లిన మాట మాత్రం వాస్తవం అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కరోనా టెస్టు రెండు సార్లు చేయించుకున్న తర్వాత ఆయన కు ఎలాంటి కరోనా లేదని నిర్థారణ అయ్యింది.దానికి తోడు కరోనా లక్షణాలు కూడా ఏమీ లేకపోవడంతో నిర్భయంగా ఆయన బయట తిరిగేయవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారు.

దాంతో ప్రస్తుతం దిల్‌ రాజు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నాడు.

#Fake #Dil Raju Corona #Dil Raju #DilRaju #DilRaju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు