టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలే ఇక బీజేపీ రాజకీయబల వ్యూహమా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.బీజేపీ రోజురోజుకు బలపడాలనే ఉద్దేశ్యంతో రకరకాలగా టీఆర్ఎస్ పార్టీ ఫై వ్యతిరేక కార్యాచరణతో ముందుకెళ్తూ ఒకింత ప్రజల దృష్టి బీజేపీ వైపు మళ్లించుకునేలా వ్యూహాలను సిద్దం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

 Is Criticism Of The Trs A Political Tactic Of The Bjp Details, Telangana Politics, Bjp Party, Cm Kcr, Bandi Sanjay, 2024 Elections, Kcr Strategies, Ktr, Kishan Reddy, Telangana Bjp-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీజేపీ వద్ద బలపడటానికి ఉన్న ఏకైక అవకాశం టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించడమే.దీనిని చాలా వ్యూహాత్మకంగా అమలు చేయాలని బీజేపీ భావిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇక్కడే బీజేపీ కొంత సంశయిస్తున్న పరిస్థితి ఉంది.ఒకే వైపుగా టీఆర్ఎస్ ని విమర్శిస్తూ పోతే బీజేపీని కెసీఆర్ చాలా చాకచక్యంగా వాడుకునే అవకాశం ఉందని, అందుకే కొన్ని కొన్ని విషయాలను మాత్రమే ఆధారంగా చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది. 

 Is Criticism Of The TRS A Political Tactic Of The BJP Details, Telangana Politics, Bjp Party, Cm Kcr, Bandi Sanjay, 2024 Elections, Kcr Strategies, Ktr, Kishan Reddy, Telangana Bjp-టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలే ఇక బీజేపీ రాజకీయబల వ్యూహమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజకీయంగా టీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ చాలా బలహీనంగా ఉన్న విషయం తెలిసిందే.అందుకే టీఆర్ఎస్ కూడా బీజేపీని ఎక్కడ దెబ్బ కొట్టాలో కూడా పూర్తిగా తెర వెనుక సన్నద్దమై ఉన్నా బీజేపీ శైలి పట్ల ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చిన తరువాత ప్రజల్లోకి బీజేపీని ఎలా తీసుకెళ్లాలో కెసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది.

తద్వారా బీజేపీ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనే స్పష్టమైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.మరి బీజేపీ చేస్తున్న ఈ కార్యాచరణతో బీజేపీ రాజకీయంగా బలపడుతుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా భవిష్యత్ లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అప్పటి వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారన్నది సుస్పష్టం.మరి బీజేపీ విమర్శనాస్త్రాలకు టీఆర్ఎస్ పార్టీ ఎలా ప్రతి విమర్శనాస్త్రాలు సంధిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Is Criticism Of The TRS A Political Tactic Of The BJP Details, Telangana Politics, Bjp Party, Cm Kcr, Bandi Sanjay, 2024 Elections, Kcr Strategies, Ktr, Kishan Reddy, Telangana Bjp - Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, Bandi Sanjay, Bjp, Cm Kcr, Kcr, Kishan Reddy, Telangana Bjp, Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube