ఏపీలో సైలెంట్ ఓటింగ్..!!!..ఎవరికి కలిసోచ్చేను..???  

Is Created Tension In Political Leaders In Ap-

ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్నికలు రానే వచ్చేశాయి.ఉదయం 7 గంటలకి మొదలైన పోలింగ్ నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది.

Is Created Tension In Political Leaders AP-

ఎండవేడిమి సైతం తట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.అయితే ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు.

ఎవరిని సీఎం ఫీటం వరిస్తుంది.?? అనే ప్రశ్నలు మరోమారు తెరపైకి వచ్చాయి.ప్రతీ ఒక్కరిలోనూ ఇదే తరహా ఆలోచన కలుగుతోంది ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.అయితే ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా ప్రస్తావనకి వస్తున్నాయి.

Is Created Tension In Political Leaders AP-

అందులో ఒకటి తలపండిపోయిన అనుభవం పేరుతో అవినీతిలో కూరుకుని పోయిన ప్రభుత్వానికి మళ్ళీ పగ్గాలు అప్పగించాలా లేక ఇచ్చిన మాటకోసం ఎన్ని ఇబ్బందులు ఎదురయినా అన్నిటినీ ఎదుర్కుని ధైర్యంగా నిలబడిన యువనేత కి పట్టం కట్టాలా అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.గతం కంటే ఎంతో భిన్నంగా సాగుతున్న ఈ ఎన్నికల విషయంలో ముక్కోణపు పోటీ ఉంటుంది అసలు అంచనా వేయడం ఎంతో కష్టం అని భావించారు అందరూ కానీ.

పార్టీల పరిస్తితిపై అంచనాకు రావడం చాలా తేలికగా జరిగిపోయింది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏకపక్షంగా సాగుతున్నాయని కొందరు అంటుంటే.

కాదు కాదు ద్విపక్షమని కొంతమంది అంటున్నారు.ఎలా చూసుకున్నా సరే ఏపీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తతం విపక్ష పార్టీ అయిన వైసీపీకి ఎడ్జ్ బాగా ఉందని విశ్లేషకులు సైతం చెప్పడం వైసీపీలో నూతన ఉత్తేజం రేకెత్తిస్తోంది.ప్ర‌స్తుతం పోలింగ్ ట్రెండ్స్ కూడా అవే చెపుతున్నాయి.

రాష్ట్రంలో ఓటింగ్ అంతా ఎంతో సైలెంట్ గా సాగుతోందని.ప్రతీ ఒక్కరూ మార్పు కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు.ఐదు ఏళ్ళకి ఒక్క సారి వచ్చే ఎన్నికలు కాబట్టి మార్పు అనేది పక్కా ఉండాల్సిందే అనేది యువత ఆలోచన అన్నట్టుగా తెలుస్తోంది.ఇక మహిళలు , రైతులు, ఉద్యోగులు అందరూ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే పై పైకి అధికార పార్టీకి కొమ్ము కాస్తునట్టుగా కనిపిస్తున్నా ఓటు ఎవరికీ వేయాలో ప్రజలు ముందే డిసైడ్ అయ్యారట దాంతో సైలెంట్ గా తమ పని కానిచ్చేసుకుని వెళ్ళిపోతున్నారట.

అయితే ఓటింగ్ అంతా పూర్తయిన తరువాత అసలు విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు.

రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైందని, ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలు గడిచిన నెలరోజులుగా వినిపిస్తూనే ఉంది.ప్రతి ఒక్కరూ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నారు.ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు ఇచ్చాం.ఆయన పాలన చూశాం.మరి నేను కూడా సీఎంను అవుతాను! అని చెబుతున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే పోయేది ఏముంటుంది? అనేవ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.బహుశ ప్రజల నాడిని గ్రహించారోఏమో సీఎం చంద్రబాబు.మహిళలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.పసుపు-కుంకుమ వంటి పథకాన్ని రాత్రికి రాత్రి తెరమీదికి తెచ్చారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ఒక్కరోజు ముందు వరకు కూడా మహిళలకు టీడీపీ ప్రభుత్వం పంచిన నోట్లు అందుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో ఓటింగ్‌ సరళి మారుతుందని తొలుత అంచనాలు వచ్చినా.

తర్వాత మాత్రం సైలెంట్‌ ఓటింగ్‌ ప్రారంభం కావడం, ప్రస్తుతం మార్పు కోరుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.ఈ మార్పు వైసీపీకి అనుకూలంగా కూడా ఉంటుందని చెబుతున్నారు.

మొత్తానికి జగన్‌ ఆశలు నెరవేరనున్నాయని అంటున్నారు.

.

తాజా వార్తలు

Is Created Tension In Political Leaders In Ap- Related....