కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇంకా అలకవీడనట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ లో, తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి పేరు తెలియని వారుండరు.అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండే కోమటి రెడ్డి వెంకట రెడ్డి అధిక ప్రాధాన్యత ఉండేది.

 Is Congress Leader Komati Reddy Venkata Reddy Still Untouched-TeluguStop.com

కాని తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ వాళ్ళందరు తెలంగాణకు అనుకూలంగా కొద్దిగా మద్దతివ్వడానికి తటపటాయించినా, ఫేక్ రాజీనామాలు చేసినా కోమటి రెడ్డి మాత్రం అక్కడికక్కడే తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు.అప్పటి నుండే నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా రాష్ట్రమంతా ఆయన పేరు మారు మ్రోగింది.

ఇక ఆ తరువాత తెలంగాణ ఏర్పడటం కాంగ్రెస్ ఓటమి చెందటం ఇవన్నీ మనకు తెలిసిందే.ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు.

 Is Congress Leader Komati Reddy Venkata Reddy Still Untouched-కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇంకా అలకవీడనట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన సమయంలో రేవంత్ రెడ్డికి పోటీగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది.అయితే చివరికి రేవంత్ పేరు ఖరారు అయినట్లు తెలిసింది.

అయితే రేవంత్ పేరు ఖరారు అయిన తరువాత కోమటి రెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇక ఆ తరువాత కోమటి రెడ్డి పార్టీ వీడతారనే ప్రచారం సాగింది.

అయితే రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకం తరువాత కోమటి రెడ్డి యాక్టివిటీస్ చాలా తగ్గాయి.

Telugu @revanth_anumula, #telanganacongress, Komati Reddy, Komati Reddy Comments Revanthreddy, Komati Reddy Under Dissatisfaction, Telangana Congress, Telangana Politics, Ts Politics-Political

రేవంత్ పాల్గొన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొనని పరిస్థితి ఉంది.అయితే ఈ తరుణంలో కోమటి రెడ్డి ఇంకా అలకవీడినట్టు లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.మరి రేవంత్ ఒక అడుగు ముందుకేసి కోమటి రెడ్డి  విషయంలో ఏమైనా సఫలమయ్యే చర్యలు తీసుకుంటారా లేదా లేకుంటే చెరో దారిలో వెళ్ళడానికి సిద్దమయ్యారా అన్నది చూడాల్సి ఉంది.

#Komati Revanth #Komati #Komati Reddy #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు