కలర్‌ ఫోటోతో సునీల్‌ కు దక్కింది ఏంటీ?

సుహాస్‌, ఛాందిని చౌదరి దర్శకత్వంలో సందీప్‌ తెరకెక్కించిన కలర్‌ ఫోటో ఇటీవలే విడుదల అయ్యింది.ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

 Is Color Photo Any Help To Telugu Comedian Sunil   Sunil, Colour Photo, Suhas, C-TeluguStop.com

ఇదే సమయంలో ఆ సినిమాకు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు ఇచ్చారు.ఇక ఈ సినిమాలో నటించిన సుహాస్‌ మరియు ఛాందిని చౌదరిలకు మంచి పేరు దక్కింది.

కాని విలన్‌ పాత్రలో నటించిన సునీల్‌కు మాత్రం పెద్దగా ఇమేజ్‌ దక్కలేదు.సునీల్‌ ఇప్పటికే ఒకసారి విలన్‌గా నటించి నిరాశ పర్చాడు.

ఈ సినిమాలో కూడా విలన్‌గా ఆకట్టుకోలేక పోయాడు.ముఖ్యంగా సినిమాలో ఆయన పాత్ర కథలో కీలకం అయినా కూడా ఎక్కువ స్కోప్‌ లేదు.

దాంతో ఆయన నిరాశ పర్చాడు.ప్రస్తుతం సునీల్‌ కెరీర్‌ చాలా నిరాశ జనకంగా ఉంది.

ఇలాంటి సమయంలో ఆయన కలర్‌ ఫోటో సక్సెస్‌ తో మంచి ఛాన్స్‌లు దక్కించుకోవాల్సి ఉంది.కాని ఈ సినిమా నిరాశ పర్చింది.

కలర్‌ ఫోటో వల్ల సునీల్‌కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సునీల్‌ హీరోగా మంచి పాత్రల్లో నటించాడు.కాని వరుసగా వస్తున్న ప్లాప్‌ ల వల్ల మళ్లీ కమెడియన్‌ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.కమెడియన్‌ గా ఆకట్టుకోలేక పోయాడు.

దాంతో విలన్‌ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో వచ్చిన కలర్‌ ఫోటో విలన్‌ ఛాన్స్‌ ను సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.

కాని సునీల్‌కు ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్‌ను తీసుకు రాలేక పోయింది.దాంతో సునీల్‌ హీరోగా మళ్లీ వస్తాడు అనుకుంటున్న సమయంలో కలర్‌ ఫోటోతో ఆయన మళ్లీ కమెడియన్‌గా కూడా సక్సెస్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube