ఈటెల కోసం తెరపైకి పీవీ పేరు ? కేసీఆర్ నిర్ణయం ఏంటంటే ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఉండవు.తనతో మిత్రుత్వం అయినా, శత్రుత్వం అయినా ఆషామాషీగా ఉండదనే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు.

 Is Cm Kcr Naming Huzurabad To Pv Narasimha Rao As A Strategy On Etela Rajender ,-TeluguStop.com

తమతో సఖ్యతగా ఉన్నంతకాలం ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చే కేసీఆర్ మిత్రుత్వం అయినా, శత్రుత్వం అయినా అంతేస్థాయిలో రియాక్షన్ చూపిస్తూ ఉంటారు.కొద్ది రోజుల క్రితమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటెల రాజేందర్ వ్యవహారం కొద్దిరోజులుగా తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది.
  ఆయన బీజేపీ లోకి వెళ్లేందుకు సిద్ధం అవ్వడం తో పాటు,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఉండటం, బీజేపీ తరఫున మరింత యాక్టివ్ అయ్యి తనను టార్గెట్ చేసుకోవాలని చూస్తూ ఉండడం , హుజురాబాద్ ఉప ఎన్నికలలో మళ్ళీ తన ప్రభావాన్ని చూపించేందుకు రాజేందర్ సిద్ధం అవడంతో ఆ నియోజకవర్గంలో ఆయనకు పట్టు లేకుండా చేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన కేసీఆర్ తనదైన శైలిలో ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు.సెంటిమెంట్ రాజకీయాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్ ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రాజేందర్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు.
  దీనిలో భాగంగానే ప్రజల్లో భావోద్వేగాన్ని కలిగించేందుకు, టీఆర్ఎస్ వైపు ఉండేందుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించి టిఆర్ఎస్ కు మరింత ఆదరణ పెరిగేలా చేసుకోవాలని , ఈ విధంగా రాజేందర్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు.

Telugu Cm Kcr, Etela Rajendar, Etela Rajender, Hujurabad, Huzurabad, Pv Simha Ra

అంతేకాదు హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించడమే కాకుండా ఆ జిల్లాకు దివంగత పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.గత కొంతకాలంగా పీవీ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తోంది.ఆయన కుమార్తెను ఎమ్మెల్సీగానూ గెలిపించింది.

పివి స్వగ్రామం హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఉండడంతో దానిని జిల్లాగా ప్రకటించి పీవీ పేరు పెట్టాలని , దీని ద్వారా ఈటెల పట్టు ఈ నియోజకవర్గంలో జరగకుండా చూడాలని లక్ష్యంతో కెసిఆర్ ఈ వ్యూహాత్మక ఎత్తుగడ కు తెర తీసినట్లు గా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube