కరోనా కారణంగా చిరంజీవి చిత్రాలన్నీ ఆగిపోయాయా...?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగాకరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తున్న కారణంగా ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.అయినప్పటికీ కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు.

 Is Chiranjeevi Acharya Movie Release Date Postponed For Due To Corona Lock Down-TeluguStop.com

దీంతో ఇప్పటికే సినిమా రంగంలో కూడా దాదాపుగా సినిమా షూటింగులు మరియు సీరియళ్ళ షూటింగులు నిలిపి వేసారు.కాగా ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా “కాజల్ అగర్వాల్” నటిస్తుండగా మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్ తేజ్” మరియు “పూజా హెగ్డే” తదితరులు గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలో కనిపించనున్నారు.

 Is Chiranjeevi Acharya Movie Release Date Postponed For Due To Corona Lock Down-కరోనా కారణంగా చిరంజీవి చిత్రాలన్నీ ఆగిపోయాయా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ చిత్ర షూటింగ్ పనులను తాత్కాలికంగా కొంత కాలం పాటు నిలిపివేశారు.

కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపి వేయడంతో అనుకున్న సమయానికి “ఆచార్య” చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేస్తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా 65 శాతం పూర్తయ్యాయి.కానీ మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేసేలోపే మరోమారు కరోనా విజృంభిస్తుండడంతో షూటింగ్ నిలిపి వేశారు.

దీంతో మరోమారు ఆచార్య విడుదల తేదీ మారనుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మలయాళంలో మంచి విజయం సాధించిన “లూసిఫర్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఆగిపోయినట్లు సమాచారం.

ఏదేమైనప్పటికీ ప్రశాంతంగా జీవిస్తున్న మానవాళికి కరోనా వైరస్ తీవ్ర ముప్పుని తెచ్చిపెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#Corona Virus #AcharyaMovie #Ram Caran Tej #Chiranjeevi #IsChiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు