ఆ దేశ ఎయిర్ పోర్ట్ ను చైనా స్వాధీనం చేసుకోబోతుందా..?!

Is China Going To Take Over That Countrys Airport

ఉగాండాలోని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి చైనా దగ్గర తీసుకున్న అప్పు తీర్చని కారణం చేత ఉగాండాలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాయాశ్రయం అయిన ఎంటెబ్బే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను చైనా స్వాధీనం చేసుకోబోతుందంటూ కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఆ వార్తలన్ని అవాస్తవమే అని ఉగాండా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి అయిన వియానీ ఎం.

 Is China Going To Take Over That Countrys Airport-TeluguStop.com

లుగ్యా శనివారం రోజున ట్విట్టర్ ద్వారా అందరికి తెలియచేసారు.నిజానికి మార్చి 31, 2015 సంవత్సరంలో ఉగాండాలోని ఎంటెబ్బే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం 200 మిలియన్ డాలర్లు అవసరం కాగా.

ఆ నిధుల కోసం ఉగాండా ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్ (EXIM) బ్యాంక్ ఆఫ్ చైనాతో రుణ ఒప్పందంపై సంతకం చేసినది.

 Is China Going To Take Over That Countrys Airport-ఆ దేశ ఎయిర్ పోర్ట్ ను చైనా స్వాధీనం చేసుకోబోతుందా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే.

రుణ ఒప్పందంలో ఉన్న కొన్ని నిబంధనలను సవరించాలని ఉగాండా అధికారులు కోరుతున్నారు.చైనా బ్యాంకు పెట్టిన ముఖ్యమైన రెండు షరతులను మర్చాలని ఉగాండా ప్రభుత్వం కోరుతోంది.

కానీ ఉగాండాకు అనుకూలం కాని కొన్ని నిబంధనలను UCAA అమలు చేయడంలో విఫలమైందని, రుణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ఎగ్జిమ్ బ్యాంక్ నిధులను నిలిపివేసిందని, డబ్బులు చెల్లించడానికి బదులుగా ఉగాండా ప్రభుత్వం ఎంటెబ్బే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనాకు అప్పగించించేందుకు సిద్ధమయ్యిందని వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై స్పందిస్తూ వియానీ ఎం.లుగ్యా ఈ విధంగా ట్వీట్స్ చేసారు.శనివారం చేసిన వరుస ట్వీట్ లలో….

” స్టాన్బిక్ బ్యాంక్ ఉగాండాలో. UCAA సేల్స్ కలక్షన్ అకౌంట్ తెరిచిన మాట నిజమే కానీ సీఏఏ యొక్క అన్ని ఆదాయాలు ఎస్క్రో అకౌంట్ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా అందులో జమ చేయబడతాయి అని తెలిపారు.

అలాగే ఎగుమతి-దిగుమతి బ్యాంక్ ఆఫ్ చైనా ద్వారా ఉగాండాకు మంజూరు చేయబడిన రుణం 7 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌ ను కలిగి ఉందని, ఒప్పందంలో పేర్కొన్న సమయంలో కేవలం ఉగాండా ప్రభుత్వం వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.అలాగే డబ్బు చెల్లించే గ్రేస్ పీరియడ్ ఇంకా ముగియలేదని,ఉగాండా ప్రభుత్వం తమ జాతీయ ఆస్తిని(ఎయిర్ పోర్ట్) ని వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలిపారు.అలాగే చైనా ప్రభుత్వంపై అప్పు చిచ్చు అంటూ వస్తున్న వార్తలపై చైనా ప్రభుత్వం కూడా స్పందించింది.” ఉగాండా విమానాశ్రయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చైనా కాచుకుని ఉందని వచ్చిన వార్తలు అవాస్తవం అని ఆఫ్రికన్ వ్యవహారాలను చూసే చైనా డైరెక్టర్ జనరల్ వు పెంగ్ తెలిపారు.అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టి పారేసారు.

#Airport #Occupy #China #Uganda

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube