చిన్న పిల్లలు బబుల్‌గమ్‌ మింగితే చనిపోతారా.. వైధ్యులు ఏమంటున్నారంటే

ఏం రుచి అనిపిస్తుందో కాని కొందరు పిల్లలు చాక్‌లెట్స్‌ కంటే ఎక్కువగా, ఇష్టంగా బబుల్గమ్స్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.బబుల్గమ్‌ తింటే కడుపులో పేగులు చెడిపోతాయి అనేది చాలా మంది అనుకునే మాట.

 Is Chewing Gum Good Or Bad For Children-TeluguStop.com

ముఖ్యంగా పెద్ద వారు పిల్లలు బబుల్గమ్‌ తింటే చాలా భయపడతారు.ఒకవేళ అది వారు పొరపాటున మింగితే పరిస్థితి ఏంటీ, అది పేగులకు అంటుకుని ఉండి, పిల్లలు చనిపోయేలా చేస్తుందా అంటూ భయపడుతున్నారు.

బబుల్గమ్‌ గురించి పెద్దల్లో ఉన్న భయాలను తొలగించేందుకు నిపుణులు క్లారిటీ ఇచ్చారు.బబుల్గమ్‌ మింగితే పిల్లలు చనిపోరు అని తేల్చి చెప్పారు.

పిల్లలు మాత్రమే కాదు పెద్దలు బబుల్గమ్‌ పొరపాటున మింగినా ఏం కాదని, అది జీర్ణం అవుతుందని చెబుతున్నారు.మనిషి శరీరంలో జీర్ణ క్రియ అనేది ఒక అద్బుతం, కొందరు రాళ్లు తిన్నా కూడా అరిగించుకునే సత్తా కలిగి ఉంటుంది.

జీర్ణవ్యవస్థలో ఉండే కొన్ని రసాయనాలు ఎంత తిన్నా, ఏం తిన్నా కూడా స్మాష్‌ చేయగలవు.కొంత మంది జీర్ణ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు.

అలాంటి వారు ఒక వేళ బబుల్గమ్‌ మింగితే మాత్రం సమస్య ఏర్పడుతుంది.

జీర్ణ వ్యవస్థ అనేది పిల్లలకు చాలా బాగా పని చేస్తుంది.

అందువల్ల ఎలాంటి ఆందోళన పడనక్కర్లేదు.ఒకవేళ పిల్లలు చుయింగమ్‌ మింగినా కూడా వారు దాన్ని జీర్ణం చేసుకోగలరు అంటూ వైధ్యులు చెబుతున్నారు.

చుయింగమ్‌ మింగినంత మాత్రాన పిల్లలు చనిపోరు.అయితే కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిదే.

ఇనుము లేదా మరేదైనా మెటల్‌ పదార్థాలు మాత్రం నోట్లో పెట్టుకోకుండా చూడటం బెటర్‌.ఎందుకంటే అవి జీర్ణం కావు.

నలుగురికి ఉపయోగపడే ఈ సమాచారం తప్పకుండా స్నేహితులతో షేర్‌ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube